Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2024: గ్రౌండ్ లోకి వచ్చి కాళ్లపై పడ్డ అభిమానిని కాపాడిన ధోనీ..!

నిన్న అహ్మదాబాద్ లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 200 పరుగులకు పైగా స్కోరు సాధించి చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే దీన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో బ్యాటింగ్ కు దిగిన ఎంఎస్ ధోనీ ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ అభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు.

ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. మధ్యలో అనూహ్యంగా ఓ అభిమాని గ్రౌండ్ లోకి దూసుకెళ్లాడు. ధోనీని చేరుకుని అతని కాళ్లపై పడ్డాడు. అనంతరం కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ధోనీ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అయితే వెంటనే తేరుకుని అభిమానిని తిరిగి స్టాండ్స్ లోకి వెళ్లాలని సూచిస్తూ పిచ్ నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో సదరు అభిమానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది కూడా మైదానంలోకి వచ్చారు.

IPL 2024 how ms dhoni guard fan enters into ground during match and touched his feet


అయితే ధోనీ మాత్రం అభిమానిని వదలకుండా అలాగే పక్కకు తీసుకెళ్లాడు. చివరికి అతనికి ఎలాంటి హానీ కలగకుండా భద్రతా సిబ్బందికి చెప్పి గ్రౌండ్ లో నుంచి గ్యాలరీలోకి పంపించాడు. ఈ ఘటన ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఎంఎస్ ధోనీపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను మరోసారి గుర్తుచేసింది. అదే సమయంలో అభిమానుల విషయంలో ధోనీ ఎలా వ్యవహరిస్తాడో కూడా తెలియజేసింది. తాజా ఘటనతో మహీ మరో ఎత్తుకు ఎదిగాడని అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+