IPL 2024: ఢిల్లీపై గెలిచాక మళ్లీ చీలిన ముంబై-రోహిత్-హార్ధిక్ ట్వీట్లపై ఫ్యాన్ వార్.. !

కెప్టెన్సీ వివాదాల్లో చిక్కుకుని ఈసారి ఐపీఎల్ లో బోణీ కొట్టడమే కష్టంగా మారిన ముంబై ఇండియన్స్ జట్టు ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. అంతకు ముందు రోహిత్, హార్ధిక్ వర్గాలుగా చీలిపోయి వార్ కొనసాగిస్తున్న అభిమానులు.. ఇప్పుడు గెలిచాక కూడా మరోసారి చీలిపోయారు. దీనికి రోహిత్, హార్ధిక్ చేసిన ట్వీట్లే కారణమయ్యాయి.

ఈసారి ఐపీఎల్ లో ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన ముంబై.. ఆదివారం ఢిల్లీపై అద్భుతమైన విజయంతో టోర్నీలో బోణీ కొట్టింది. జట్టు సమష్టి కృషితో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యాతో పాటు జట్టులో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించి ముంబైని విజయ పథాన నిలిపారు. అయితే ఆ తర్వాత అసలు పోరు మొదలైంది.

IPL 2024 Mumbai Fans divided as rohit hardik again after maiden win against delhi

ఢిల్లీపై విజయం తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్వీట్ చేసాడు. "మేము సిద్ధంగా ఉన్నాము మరియు నడుస్తున్నాము అంటూ పోస్టు పెట్టాడు. ఇందులో ఢిల్లీతో మ్యాచ్ ఫొటోల్ని కూడా జత చేశాడు. మరోవైపు రోహిత్ కూడా "ఆఫ్ ది మార్క్" అనే క్యాప్షన్‌తో ఇదే పోస్టు పెట్టాడు. అయితే హార్ధిక్ పాండ్యా పెట్టిన పోస్టులో హిట్ మ్యాన్ ఫొటో పెట్టగా.. రోహిత్ మాత్రం హార్ధిక్ పాండ్యా పిక్ లేకుండానే ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు దీనిపై విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+