బయటపడ్డ కావ్య పాప సీక్రెట్ ఎఫైర్.. అతనితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది

కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.

కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.కావ్య మారన్ పలువురితో డేటింగ్ చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్‌తో కావ్య మారన్ ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు షికార్లు చేశాయి.

అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి షాకిచ్చారు. అయినప్పటికీ వీరిద్దరు చెట్టాల్ పట్టాల్ వేసుకుంటూ తిరుగుతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు. అనిరుధ్‌, కావ్య మార‌న్ సీక్రెట్‌గా ఫారిన్ వెళ్లారు. అనిరుధ్‌, కావ్య మార‌న్ జంట‌గా ఈ ట్రిప్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. లండన్ విధుల్లో షికార్లు చేస్తుండ‌గా.. ఈ ప్రేమజంట కెమెరా కంటకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

Kavya Maran secretly went to London with her boyfriend

దీంతో మరోసారి వీళ్ల రిలేషన్ గురించి చర్చ సాగుతోంది.వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు సైతం అంగీకరించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఇప్పటికైనా ఈ జంట తమ బంధం గురించి ప్రకటిస్తారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+