ధోనీ కమ్ బ్యాక్ పై తేల్చేసిన CSK యాజమాన్యం, వాట్ నెక్స్ట్...!!
IPL 2026: CSK కు ఈ సారి లీగ్ దశ ప్రారంభం కలిసి రాలేదు. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసుకుంది. ఈ టోర్నీకి స్టార్ ప్లేయర్ ధోనీ దూరంగా ఉన్నారు. రెండు వారాల తరువాత ధోనీ టీంలో చేరుతారని ఐపీఎల్ ప్రారంభం వేళ ప్రకటించారు. కాగా.. ఇప్పుడు వరుస పరాజయాల తో ధోనీ రీ ఎంట్రీ మరింత ముందుగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ధోనీ కమ్ బ్యాక్ పైన చెన్నై జట్టు యాజమాన్యం స్పష్టత ఇచ్చింది.
IPL 2026 ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే ఇప్పటి వరకు అభిమానులకు నిరాశే మిగుల్చింది. ఆడిన మూడు మ్యాచులు ఓడిపోయింది. ఈ సమయంలో అభిమానులకు కొంత రిలీఫ్ ఇచ్చే న్యూస్ బయటకు వస్తోంది. గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ ఇప్పటికే నెట్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఫిట్ నెస్ టెస్టు ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. అందులో అంతా బాగుంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి ధోనీ గ్రౌండ్ లోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ టెస్టు పూర్తయ్యే ఛాన్స్ ఉందని జట్టు వెల్లడించింది. ధీనీ ఫిట్ నెస్ సాధిస్తాడని జట్టు కోచ్ ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎస్కే ఫ్యాన్స్ సైతం ధోనీ త్వరగా జట్టులో అడుగు పెట్టాలని.. తిరిగి చెన్నైను గెలుపు ట్రాక్ లోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు.

ఢిల్లీ మ్యాచ్ నుంచి అందుబాటులోకి ధోనీ
కాగా, సీఎస్కే తమ తదుపరి మ్యాచ్ ఈ నెల 11న హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లోనే ధోనీ తిరిగి టీంలో అడుగు పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు టీం మనేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. నెట్స్ లో ప్రాక్టీసు చేస్తున్న ధోనీ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొంత ఇబ్బందిగా కనిపించిన ధోనీ.. ఇప్పుడు సాధారణ స్థితిలోనే కనిపిస్తున్నారు. కాగా.. ఆదివారం జరిగిన ఆర్సీబీ మ్యాచ్ లోనే ధోనీ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే, ధోనీ పూర్తిగా కోలుకునే వరకూ రిస్కు తీసుకోకూడదని జట్టు యాజమాన్యం నిర్ణయం కారణంగా ఆ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. ఇక.. ఢిల్లీతో మ్యాచ్ కు ధోనీ ఖచ్చితంగా గ్రౌండ్ లోకి దిగుతారని చెబుతున్నారు. ధోనీతో పాటుగా బ్రెవిస్ సైతం జట్టుకు దూరం కావటం మైనస్ గా మారింది. కాగా.. ఇప్పుడు ధోనీతో పాటుగా బ్రెవిస్ సైతం కోలుకుంటున్నాడు. ఈ ఇద్దరు ఢిల్లీ మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో.. ఇక సీఎస్కే తిరిగి గెలుపు బాట పడుతుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications