కృనాల్ పాండ్యా విసిరేసే బంతులను ముంబై బ్యాటర్లు ఎలా ఫేస్ చేస్తారో..!!
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు డబుల్ హెడ్డర్స్ జరుగనున్నాయి. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడబోతోంది గుజరాత్ టైటాన్స్. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏక్నాస్టేడియం దీనికి వేదిక. మరో మ్యాచ్ ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు జరిగే ఈ గేమ్ కు వాంఖెడే స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
కేరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య పోటీగా దీన్ని చూడొచ్చు. వాళ్లే ఈ మ్యాచ్‌కు ప్రత్యేకం.. ప్రధాన ఆకర్షణ కూడా. ఐపీఎల్ లో ఇప్పటికే ఈ దిగ్గజ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. తమ తమ జట్లకు మూలస్తంభాల్లా నిలిచారు. ఈ రెండు జట్లు కూడా రాజస్థాన్ రాయల్స్‌తో ఓడాయి. విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తోన్నాయి. హోమ్ పిచ్ కావడం ముంబై ఇండియన్స్ కు కలిసి వచ్చే అంశం. కృనాల్ పాండ్యా మరో అట్రాక్షన్ గా నిలువనున్నాడు. స్పిన్నరే అయినా బంతులను బుల్లెట్లలా సంధిస్తోన్నాడీ మధ్య. బౌన్సర్లు వేస్తోన్నాడు. అతన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఈ సాయంత్రం తేలుతుంది.

హెడ్ టు హెడ్..
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై 19 మ్యాచ్‌లు గెలిచింది. 15 మ్యాచ్‌లలో ఓడింది. విజయాల్లో పెద్ద తేడా లేదు. ప్రతీసారీ హోరాహోరీగా తలపడ్డాయి. స్టేడియంలో పరుగుల వరద పారించాయి. ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ కూడా ఇదే రేంజ్ లో ఉండొచ్చని సగటు అభిమాని ఆశిస్తోన్నాడు. మొదట ఎవరు బ్యాటింగ్ చేసినా 200 ప్లస్ స్కోర్ ఉండొచ్చు.
పిచ్ రిపోర్ట్..
ముంబై వాంఖడే స్టేడియం పిచ్ భారీ స్కోర్లకు అనువుగా ఉంటుంది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉండే ఈ పిచ్ పై పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పిచ్ పై పడే బంతి.. పేస్, బౌన్స్ ను అద్భుతంగా క్యారీ చేస్తుంది. బ్యాటర్లు ప్రారంభం నుంచే స్వేచ్ఛగా షాట్లు ఆడగలరు. ఇది ఐపీఎల్ లో అత్యంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ లల్లో ఒకటి.
ముంబై ఇండియన్స్ తుదిజట్టులో- రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా ఆడే అవకాశం ఉంది.
ఇంపాక్ట్ సబ్: షెర్ఫానె రూథర్‌ఫర్డ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టులో- విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్/జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్ ఆడొచ్చు.
ఇంపాక్ట్ సబ్: సుయాష్ శర్మ
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!! -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
బీసీసీఐ రూల్స్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్‌కు చిక్కులు! -
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా? -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
అరె ఓ సాంబా.. ఇంకో రెండు పాయింట్లు ఇచ్చుకో -
ఆయన వల్లే ఈ సెంచరీ.. నా లక్కీ ఛార్మ్: సంజూ శాంసన్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
IPL 2026: బోణీ కొట్టిన చెన్నై.. మ్యాచ్ మలుపు తిరిగిందక్కడే! -
అందరి నోళ్లూ ముయించాడు గానీ.. -
రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ వీడియో












Click it and Unblock the Notifications