న్యూజిలాండ్ బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్- టీమిండియాపై భారీ గెలుపు

ధాభారత్ తో హామిల్టన్‌లో జరిగిన అయిదో టీ20లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. టాస్ గెలిచి ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. భారత జట్టు విధించిన 191 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే సునాయాసంగా అందుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో కివీస్ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ను 2-3 తేడాతో ముగించింది న్యూజిలాండ్. సిరీస్ ఇప్పటికే టీమిండియా సొంతమైంది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్ సీఫెర్ట్ గ్రౌండ్ నలుమూలలా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 50 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు సాధించి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. అతనికి తోడుగా నిలిచిన గ్లెన్ ఫిలిప్స్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్- 2, డారిల్ మిఛెల్- 29 పరుగులు చేశారు.

New Zealand defeated the India by 7 wickets in the 5th and final T20I at Hamilton Tis Siefert shines

ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ నిరాశపరిచింది. అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌలింగ్ చేసి 45 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ కూడా తన 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అర్ష్‌దీప్ సింగ్ దీ అదే పరిస్థితి. 4 ఓవర్లలో 40 పరుగులకు పడగొట్టింది ఒక్క వికెట్ మాత్రమే. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు.

పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!
పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!

రన్ ఛేజ్‌లో న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే వికెట్ పడింది. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ త్వరగానే పెవిలియన్ చేరాడు. అతని తర్వాత క్రీజ్ లోకి వచ్చిన డారిల్ మిఛెల్ తో కలిసి సీఫెర్ట్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ద్వయం బౌలర్లపై ఒత్తిడి పెంచింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మిచెల్ నిష్క్రమించినప్పటికీ.. గ్లెన్ ఫిలిప్స్ బాధ్యతను భుజానెత్తుకుని మ్యాచ్‌ను ముగించాడు.

పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి
పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి

అంతకుముందు భారత్ బ్యాటింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సాగలేదు. ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. టాప్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్- 61, కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్- 50 పరుగులతో ఇన్నింగ్ ను నిలబెట్టారు. నమన్ ధీర్- 33, నితీష్ కుమార్ రెడ్డి- 22 పరుగులతో మెరుపులు మెరిపించడంతో 191 పరుగులను అందుకుంది భారత్. బ్యాటర్ల శ్రమను బౌలర్లు వృధా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+