హార్దిక్ పాండ్యా కొంపముంచిన ఆ ఎఫైర్

అందరు అనుకున్నట్టే జరిగింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం విషాదంతంగా ముగిసింది. హార్దిక్ తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇద్దరూ విడిపోయినా.. తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు.నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నం చేసాము.

మా ఇద్దరికి ఇది కఠినమైన నిర్ణయమే.. కానీ మా ఇద్దరికీ ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాము. ఈ ప్రయాణాన్ని మేము సంతోషించాము. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటాం. అతడిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ.. మద్దతు ఇవ్వాలని అందరిని కోరుకుంటున్నానని పాండ్యా, నటాషా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

reasons behind Hardik Pandya and Natasa divorce

ఇక ఐపీఎల్ ప్రతి సీజన్‌లో నటాషా కనిపించి తన భర్త హర్దిక్‌కు సపోర్ట్ చేసేది. అయితే ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినా.. నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాగే, అతను ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు. అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అప్పుడే అంతా భావించారు.

హార్దిక్ పాండ్యాకు విడాకులకు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ కూడా ఓ కారణమని అంటున్నారు. నటాషా అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ అనే వ్యక్తితో క్లోజ్‌గా కనిపిస్తూ దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో కలిసి మీడియా కంటబడింది నటాషా. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని వార్తలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.దీంతో నటాషా హార్దిక్‌కు దూరం కావడానికి అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ కారణమని భావిస్తోన్న అభిమానులు అతనిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+