Rohit Sharma: పంజాబ్ మ్యాచ్ లో రోహిత్ ఆడతాడా ? ముంబై క్లారిటీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో ముంబై ఇండియన్స్ పరిస్ధితి ఏమాత్రం బాగోలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో కేవలం ఒకటి గెలిచి మూడు ఓడిపోయింది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ తో ఆడిన గత మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయపడ్డాడు. అదీ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ వేళ రోహిత్ శర్మ లేకుండానే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగబోతోందా అన్న చర్చ జరుగుతోంది.

పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ పాల్గొనడంపై మ్యాచ్ ముందు నిర్ణయం తీసుకుంటామని ముంబై ఇండియన్స్ ప్రకటించింది. అంటే అప్పటివరకూ రోహిత్ ను ఆడించడంపై ముంబై ఇండియన్స్ వేచి చూసే అవకాశాలు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఛేజింగ్ చేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డ రోహిత్ శర్మ.. ఆరో ఓవర్‌లో మైదానం వీడాల్సి వచ్చింది.

Rohit Sharma All But Ruled Out of PBKS Clash MI to Confirm Availability today

ఆ ఓవర్ ప్రారంభానికి ముందే రోహిత్‌కు టీమ్ ఫిజియో చికిత్స అవసరమైంది. దీంతో ఆట కూడా ఆలస్యమైంది. రోహిత్ తర్వాతి బంతిని ఎదుర్కోవడానికి తిరిగి వచ్చినప్పటికీ, కేవలం ఒక డిఫెన్సివ్ షాట్ ఆడి గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, అతని గాయం తీవ్రతను నిర్ధారించడానికి రోహిత్‌కు స్కానింగ్‌లు చేయాల్సి ఉంది. ఆటకు ముందు, విల్ జాక్స్ త్వరలో జట్టులో చేరనున్నాడనే వార్తతో సహా ముంబై పలు అప్ డేట్స్ ఇచ్చింది. ఇందులో గాయపడ్డ రోహిత్ ను వైద్య బృందం, కోచింగ్ సిబ్బంది పరీక్షిస్తున్నారని తెలిపింది. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే ముంబై.. క్వింటన్ డి కాక్‌ను మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కు జతగా ఆడించే విషయాన్ని పరిశీలించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+