IPL 2024: ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ గుడ్ బై ? ఐపీఎల్ కు ముందే..

ఈసారి ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తనను తొలగించి గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న మాజీ సహచరుడు హార్ధిక్ పాండ్యాకు అప్పగించడాన్ని రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడా ? కెప్టెన్సీ నుంచి తప్పించడం ఓ ఎత్తయితే ఆ తర్వాత మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్న తీరు రోహిత్ తో పాటు అతని కుటుంబం, అభిమానుల్ని ఎక్కువగా బాధ పెడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించిన ఫ్రాంచైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్ధిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హర్ట్ అయిన రోహిత్ అభిమానులు దాదాపు 4 లక్షల మంది సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ఖాతాకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రోహిత్ కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు కారణాల్ని ఫ్రాంచైజీ, కోచ్ ఇలా ప్రతీ ఒక్కరూ చర్చించుకోవడం రోహిత్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈసారి ఐపీఎల్ పై దృష్టిపెట్టడం కూడా కష్టమేనని రోహిత్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

rohit sharma may leave mumbai indians before IPL 2024 amid captaincy row

అందుకే ఈసారి ఐపీఎల్ టోర్నీకి ముందే ముంబై ఇండియన్స్ ను వీడేందుకు రోహిత్ శర్మ సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా టోర్నీకి ముందు ఓ జట్టు నుంచి ఏ ఆటగాడైనా పక్కకు తప్పుకుని ఇతర జట్లకు వెళ్లే అవకాశం ఉందా అంటే ఉందని, లేదంటే లేదని అనుకోవాల్సిన పరిస్దితి. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉన్న ట్రేడ్ ఆప్షన్ ద్వారా రోహిత్ జట్టును వీడే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2024 మినీ వేలం తర్వాత ఒక రోజు తర్వాత తిరిగి తెరిచిన ట్రేడింగ్ విండో .. టోర్నమెంట్ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు తెరిచే ఉంటుంది.

ఐపీఎల్ 2024 మార్చి చివరి వారంలోపు ప్రారంభమయ్యే అవకాశం లేదని పరిగణనలోకి తీసుకుంటే జట్లు ఫిబ్రవరి చివరి వారం వరకు ఆటగాళ్లను మార్చుకోవచ్చు. అలాగే ఇతర ఫ్రాంచైజీలు రోహిత్ ను తీసుకోవాలని అనుకున్నా తమకు అందుబాటులో అంత మొత్తం ఉంటుందా లేదా అనేది అనుమానమే. అలాగే రోహిత్ ను తీసుకోవాలంటే మరో ఆటగాడిని తాము వదులుకోవాల్సి ఉంటుంది. ఇదంతా సాధ్యమయితే రోహిత్ ముంబై ఇండియన్స్ ను వీడిపోయే అవకాశాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+