T20 World Cup: టీమిండియాకు మరో యువరాజ్ దొరికినట్లేనా? రోహిత్ టెస్ట్ పాస్!

ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ కు జట్టు ఎంపిక సెలక్టర్లకు సునాయాసమయ్యేలా కనిపిస్తోంది. ఒకరిద్దరు ఆటగాళ్లను మినహాయిస్తే ఇప్పటికే పూల్ లో ఉన్న 25-30 మంది ప్లేయర్లను పరీక్షించడం, 8-10 మంది ఆటగాళ్లను దాదాపు ఎంచుకోవడం జరిగిపోయిందంటూ తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సంకేతాలు సెలక్టర్ల పని సులువు చేసేలా ఉన్నాయి. అదే సమయంలో ఈ 8-10 మందిలో ఉన్న ఓ కీలక ఆటగాడిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో కొట్టిన ఆరు సిక్సర్లను అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు అదే స్ధాయిలో అలవోకగా షాట్లు కొడుతూ ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు శివం దూబే. అప్పట్లో యువరాజ్ సింగ్ ఎంత సునాయాసంగా బంతిని బౌండరీలు దాటించేవాడో ఇప్పుడు శివం దూబే కూడా అంతే అలవోకగా షాట్లు కొట్టేస్తున్నాడు.

shivam dube to play yuvaraj singh role in indias t20 squad for worldcup, rohit sharmas pick also

గతంలో శివందూబే ఆడిన టోర్నీలు, కొట్టిన షాట్లు వేరు. ఇప్పుడు తాజాగా ఆప్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ లో శివం దూబే కొట్టిన షాట్లు చూస్తే యువరాజ్ సింగ్ ను కామెంటేటర్లు పదే పదే గుర్తుచేసుకోక తప్పలేదు. ముఖ్యంగా ఆన్ సైడ్ లో దూబే షాట్లు చూస్తుంటే అభిమానులకు సైతం యువీ మెరుపు షాట్లే గుర్తుకొచ్చాయి. ఇవే షాట్లు ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఆకట్టుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు సెలక్షన్ ఇంకా జరగకపోయినా ఇప్పటికే తన మనసులో 8-10 మంది ఆటగాళ్లు ఉన్నారని రోహిత్ శర్మ చెప్పగలగడం వెనుక దూబే వంటి ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+