మెంటల్ మాస్ మ్యాచ్- రెండు సూపర్ ఓవర్లు: నరాలు తెంచిన దక్షిణాఫ్రికా: హీరో అతడే
అసలు సిసలు టీ20 మజా చూపిన మ్యాచ్ ఇది. దక్ఝిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య సాగిన పోరు ఇది. సీట్ ఎడ్జ్, నెయిల్ బైటింగ్.. వంటి ఎన్ని పదాలు ఉంటే అన్నీ వాడేయొచ్చు. రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్ అంటే మాటల్లో వర్ణించడం అసాధ్యం. రెండు సార్లు స్కోర్ సమం అయ్యాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 187 పరుగుల వద్ద స్కోర్ సమం కాగా.. అది సూపర్ ఓవర్ కు దారి తీసింది. అక్కడా స్కోర్ సమమే అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సొచ్చింది. అందులో కూడా సిక్సర్ల వర్షం కురిసింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలో చెలరేగింది గానీ.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు దూకుడు ప్రదర్శించడంతో దాన్ని కొనసాగించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ ఎయిడెన్ మార్క్ రమ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ జట్టు వెనుదిరిగి చూసుకోలేదు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాని రికెల్టన్ దమ్ము దులిపారు. డికాక్- 59 (41 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లు), రికెల్టన్- 61 (28 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లు) చెలరేగారు.
వీరిద్దరూ అవుట్ అయ్యాక ఆ స్థాయిలో ఎవరూ ఆడలేకపోయారు. డెవాల్డ్ బ్రెవిస్- 23, డేవిడ్ మిల్లర్- 20 (నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్- 1, మార్కొ జెన్ సెన్- 16 పరుగుల చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా తడబడింది. ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ ఒక్కడే పోరాడాడు. 42 బంతుల్లో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 84 పరుగులు బాదాడు. గుల్బదిన్ నాయబ్- 0, సేదికుల్లా అటల్- 0, డార్విష్ రసూలీ- 15, అజ్మతుల్లా ఒమర్జాయ్- 22, మహ్మద్ నబీ- 5, రషీద్ ఖాన్- 20, నూర్ అహ్మద్- 15, ఫజల్ హక్ ఫారూఖీ- 0 పరుగులు చేశారు.

చివరి ఓవర్ లో హైడ్రామా చోటు చేసుకుంది. గెలవడానికి 13 పరుగులు చేయాల్సిన దశలో చివరి ఓవర్ ను వేసిన రబడ ఒత్తిడికి గురయ్యాడు. తొలి రెండు బంతులను వైడ్ వేశాడు. దీంతో రెండు అదనపు పరుగులు, బంతులు లభించాయి. రెండో బంతిని నూర్ సిక్స్ గా మలిచాడు. నాలుగో బంతికి ఒక నోబాల్, రెండు పరుగులు లభించాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఖాయమనుకుంటుండగా.. రబడ మెరుపు వేగంతో చేసిన రనౌట్ కు నూర్ అహ్మద్ రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్ సమమైంది.
ఇది సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఎంగిడి సూపర్ ఓవర్ వేశాడు. అజ్మతుల్లా తొలి బంతిని బౌండరీ, రెండో బంతికి సిక్స్ సాధించాడు. అయిదో బంతి కూడా బౌండరీ దాటడంతో సూపర్ ఓవర్ లో మొత్తం 17 పరుగులు లభించాయి ఆఫ్ఘనిస్తాన్ కు. గెలవడానికి 18 పరుగులు చేయాల్సిన దశలో మిల్లర్, బ్రెవిస్ బ్యాటింగ్ కు దిగారు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బంతిని బ్రేవిస్ సిక్స్ గా మలిచాడు గానీ ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు.
అతని స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన స్టబ్స్ బౌండరీ.. నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. అయిదో బంతి యార్కర్ పడటంతో పరుగులేవీ రాలేదు. ఆరో బంతిని స్టబ్స్ సిక్స్ బాదాడు. దీంతో 17 పరుగులొచ్చాయి. స్కోర్ మళ్లీ సమమైంది. దీంతో మరో సూపర్ ఓవర్ వేయాల్సి వచ్చింది.
ఈ సారి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. అజ్మతుల్లా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని స్టబ్స్ సిక్స్ బాదాడు.రెండు, మూడు బంతులకు మూడు పరుగులొచ్చాయి. నాలుగో బంతిని ఈ సారి మిల్లర్ సిక్స్ కొట్టాడు. దీంతో నాలుగు బంతులకే 15 పరుగులొచ్చాయి. అయిదో బంతిని మిల్లర్ మళ్లీ ఫెన్సింగ్ దాటించడంతో స్కోర్ ఎకాఎకిన 21కి చేరింది. చివరి బంతికి రెండు పరుగులు తీశాడు మిల్లర్.
దీంతో ఆఫ్ఘనిస్తాన్ గెవడానికి 24 పరుగులు అవసరం అయ్యాయి. కేశవ్ మహరాజ్ ఈ సారి బంతి అందుకున్నాడు. తొలి బంతికి పరుగులేవీ రాలేదు. రెండో బంతికి మహ్మద్ నబీ అవుట్ అయ్యాడు. మహారాజ్ కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో బ్యాటింగ్ కు దిగిన గుర్బాజ్ 3, 4, 5 బంతులను సిక్స్ గా మలిచాడు. చివరి బంతిని వైడ్ గా వేశాడు మహరాజ్. దీంతో ఓ పరుగు, ఓ బంతి ఎక్స్ ట్రాగా వచ్చాయి. ఆరో బంతికి గుర్బాజ్ అవుట్ కావడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్ కు 19 పరుగుల వద్ద తెరపడింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications