సన్‌రైజర్స్ కు డేంజర్ బెల్స్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 31వ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ కేపిటల్స్ తలపడనుంది. జియోస్టార్ నెట్‌వర్క్ ఛానెల్‌లతో పాటు జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ లో వీక్షించవచ్చు. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సన్ రైజర్స్.. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓటమితో సీజన్ ప్రారంభించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచి పుంజుకున్నా, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌లపై స్వల్ప తేడాతో ఓడింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లపై వరుస విజయాలు సాధించి మంచి జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ మ్యాచ్‌లో నాలుగో విజయంపై కన్నేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వరుస విజయాలతో సీజన్‌ను ఘనంగా ప్రారంభించినా, తర్వాత రెండు ఓటములు చవిచూసింది. తన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డేవిడ్ మిల్లర్ ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠభరిత గెలుపును అందించాడు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. బౌలర్లకు కూడా సహకరిస్తుందనే విషయం సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో తేలింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే బౌలర్లు కూడా ఈ పిచ్ పై గణనీయమైన ప్రభావం చూపగలరని రుజువు చేసిందా మ్యాచ్. ఇక్కడ సెకెండ్ ఇన్నింగ్ ఆడే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు.
సన్ రైజర్జ్ బ్యాటింగ్ ఆర్డర్ లో నిలకడ లోపించింది. ట్రావిస్ హెడ్ తన స్థాయికి తగ్గట్లు ఆడట్లేదు. అభిషేక్ శర్మ ఓ మ్యాచ్ లో తడాఖా చూపితే, మరో మ్యాచ్ లో చేతులెత్తేస్తోన్నాడు. నితీష్ కుమార్ రెడ్డీ అంతంతమాత్రమే. హెన్రిచ్ క్లాసెన్ క్లాసెన్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అయ్యాడు. ఢిల్లీ కేపిటల్స్ లో మెరికల్లాంటి బౌలర్లు ఉండటం సన్ రైజర్స్ ప్రధాన అడ్డంకి కావొచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డును పరిశీలిస్తే, ఇరు జట్లు ఇప్పటివరకు 26 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్ టై అవ్వగా, మరొక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11లో.. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుస్సేన్, ఈశాన్ మలింగ ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్: హర్ష్ దూబే ఆడే అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టులో: పాథుమ్ నిశ్శంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, నబీ దార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్ కు చోటు దక్కొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆశుతోష్ శర్మకు ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications