Pak vs NZ: తొలి మ్యాచ్ లోనే పాక్ కు భారీ షాక్-సెమీస్ ఆశలు గల్లంతు..!

టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026)లో పాకిస్తాన్ (pakistan) సెమీ ఆశలకు భారీ షాక్ తగిలింది. కొలంబోలో న్యూజీలాండ్ తో జరగాల్సిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడటంతో అర్ధాంతరంగా రద్దయిపోయింది. దీంతో ఇరు జట్లకూ తలో పాయింట్ కేటాయించక తప్పలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు వెంటనే వరుణుడు అడ్డుపడ్డాడు. కొలంబోలో అప్పుడు మొదలైన వర్షం ఎప్పటికీ తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు రిఫరీ ప్రకటించారు.

కొలంబోలో జరగాల్సిన పాకిస్తాన్-న్యూజీలాండ్ సూపర్ 8 మ్యాచ్ కు రిజర్వ్ డే లేకపోవడంతో ఈ రెండు జట్లకూ తలో పాయింట్ కేటాయించారు. పాకిస్తాన్ జట్టుకు సూపర్ 8లో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అవి ఇంగ్లాండ్, శ్రీలంకతో. ఈ రెండు మ్యాచ్ లనూ కచ్చితంగా గెలిచినా సూపర్ 8ను పాకిస్తాన్ కేవలం ఐదు పాయింట్లతో ముగిస్తుంది. ఇందులో ఒక మ్యాచ్ ఓడి, మరొకటి గెలిస్తే కేవలం 3 పాయింట్లే ఉంటాయి.

Super 8 Shock Pakistan s Key Match with New Zealand Abandoned by Rain in t20 World cup

కానీ తమ గ్రూప్ లో మిగిలిన జట్లలో న్యూజీలాండ్ మినహా మిగిలిన ఇంగ్లాండ్, శ్రీలంకకు మూడు మ్యాచ్ లు ఉంటాయి. ఈ మూడు మ్యాచ్ లలో వారు గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇవాళ మ్యాచ్ రద్దు కావడంతో పాకి్స్తాన్ తో పాటు న్యూజీలాండ్ సైతం సెమీస్ ఆశల కోసం ఇక తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది. అయినా గ్యారంటీ లేని పరిస్ధితి ఎదురు కానుంది. ఎందుకంటే సూపర్ 8లో కేవలం మూడు మ్యాచ్ లో ఉండటం, వాటిలో అన్నీ గెలవడం లేకపోతే పాయింట్లు సమమైతేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు కివీస్ కూ ఈ అవకాశాలు తగ్గిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+