'ధురందర్’ స్టెప్పుతో సూర్యకుమార్ యాదవ్ రచ్చ! (వీడియో)
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రంలోని అక్షయ్ ఖన్నా మేనరిజమ్స్, డ్యాన్స్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ వైరల్ స్టెప్పును రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
స్కై 'ధురందర్' మోడ్
ముంబై ఇండియన్స్ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్రకు సంబంధించిన సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పును వేస్తూ వేదికపైకి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. "ఇది దాదా స్టైల్, ఫుల్ ధురందర్ మోడ్" అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ స్టెప్ వెనుక కథ
'ధురందర్' సినిమాలో అక్షయ్ ఖన్నా ఓ పాకిస్థానీ క్రైమ్ లార్డ్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన రెహ్మాన్ డకైత్ పాత్రలో కనిపించాడు. ఆయన డ్యాన్స్ చేసిన 'FA9LA' అనే ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలోని స్టెప్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆ ట్రెండింగ్ స్టెప్‌ను సూర్యకుమార్ యాదవ్ అనుకరించడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
धुरंधर और धुरंधर 2 मूवी का इतना ज्यादा क्रेज है कि कोई इससे बच नहीं पा रहा है।
— वीरू यादव (@VeerooYada39822) April 2, 2026
अब इस मूवी के दीवाने हुए Suryakumar yadav
एक इवेंट में धुरंधर के गाने पर डांस करते दिखे वैसे भी Suryakumar yadav एक अच्छे।....see more pic.twitter.com/XWQbXwoNZG
బాక్సాఫీస్ వద్ద 'ధురందర్' ప్రభంజనం
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 14 రోజుల్లోనే భారతీయ సినిమా చరిత్రలో కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది. ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూ. 920.02 కోట్లు కాగా, గ్రాస్ వసూళ్లు రూ. 1,101.47 కోట్లకు చేరుకున్నాయి. రెండో వారంలో కూడా జోరు తగ్గకుండా రూ. 245.85 కోట్లు రాబట్టింది.మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ. 102.55 కోట్లతో బోణీ కొట్టింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications