T20 World Cup 2024: భారత్ -పాక్ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్- ఏకంగా 200 రెట్లకు పైగా..!
ఈ ఏడాది జూన్ లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో అన్ని మ్యాచ్ లు ఏ ఎత్తు, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మరో ఎత్తుగా మారిపోయింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు దేశ విదేశీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
చిరకాల ప్రత్యర్ధుల మధ్య జూన్ 9న జరిగే ఈ మ్యాచ్ కు న్యూయార్క్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మరే ఇతర మ్యాచ్ కూ లేని విధంగా 200 శాతం ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉన్న టికెట్ల కంటే 200 శాతం అధికంగా డిమాండ్ ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పేలా లేదు.

న్యూయార్క్ లో ఉన్న లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 34,000 మంది ప్రేక్షకులు కూర్తునే వీలుంది. దీంతో జూన్ 9 జరిగే భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ కు ఈ మేరకు టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే దీనికి 200 రెట్లు అంటే ఏకంగా 68 లక్షల మంది నుంచి డిమాండ్ ఉందని ఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. తొలిసారి అమెరికాలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ జరగనుండటం, అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో ఈ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications