T20 World Cup 2026: రూటు మార్చిన బంగ్లాదేశ్-ఐసీసీకి మరో బిగ్ ట్విస్ట్..!

మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ ను వివాదాలు మాత్రం వీడడం లేదు. ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదాల ప్రభావం టీ20 వరల్డ్ కప్ పై పడుతోంది. భారత్-శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7న ఈ మెగా టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత్ లో మ్యాచ్ లు ఆడబోమని బంగ్లాదేశ్ (bangladesh) భీష్మించుకుని కూర్చోవడం, 24 గంటల్లో ఏదో ఒకటి తేల్చకపోతే మరో జట్టును ఎంపిక చేస్తామని ఐసీసీ తేల్చేయడంతో బంగ్లా క్రికెట్ బోర్డు రూటు మార్చింది.

ఐసీసీకి బంగ్లా తాజా డిమాండ్

భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ కు ఐసీసీ తాజాగా చివరి అవకాశం ఇచ్చింది. తమ ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు 24 గంటలు గడువిచ్చింది. అయితే నిన్న భారత్ లో మ్యాచ్ లు మాత్రం ఆడేది లేదని తేల్చిచెప్పేసిన బంగ్లాదేశ్.. ఈ టోర్నీ నుంచి తప్పుకునేందుకు సైతం సిద్దమైంది. అయితే అంతలోనే రూటుమార్చింది. ఐసీసీలో సభ్య దేశాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు పరిష్కారం చేసే కమిటీ జోక్యం కోరింది.

T20 World Cup Row Just Got Hotter Bangladesh Files New Demand With ICC after 24 hour deadline ends

తెరపైకి ఐసీసీ స్వతంత్ర వివాదాల పరిష్కార కమిటీ

భారత్ లో మ్యాచ్ లు ఆడే విషయంలో ఐసీసీ తమకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న బంగ్లాదేశ్.. ఈ వ్యవహారంలో ఐసీసీ స్వతంత్ర వివాదాల పరిష్కార కమిటీ జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ వివాదాన్ని కమిటీకి పంపాలని కోరుతూ ఐసీసీకి తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ రాసింది. ఈ కమిటీలో స్వతంత్ర న్యాయవాదులు ఉంటారు. ఐసీసీకి సంబంధించిన వివాదాలను పరిష్కరించే ఒక మధ్యవర్తిత్వ సంస్థ ఇది. ఇంగ్లీష్ చట్టాల ప్రకారం ఇది పనిచేస్తుంది, దీని విచారణలు లండన్‌లో జరుగుతాయి. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ దీన్ని తమకు ఉన్న చివరి ఆప్షన్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ దీనికి ఎంతవరకూ అంగీకరిస్తుందన్నది కూడా చూడాల్సి ఉంది. ఐసీసీ కమిటీకి ఈ ఫిర్యాదు వెళ్లకపోతే బంగ్లా కథ ముగిసినట్లే.

T20 World Cup Row Just Got Hotter Bangladesh Files New Demand With ICC after 24 hour deadline ends

ఐసీసీ కమిటీ ఏం చేస్తుంది ?

అయితే ఈ ఐసీసీ కమిటీ కేవలం అప్పీల్ ఫోరం మాత్రమే కాదు, ఐసీసీ నిర్ణయాల చట్టబద్ధత, వివరణను కూడా అంచనా వేస్తుంది. ఇది ఇచ్చే తీర్పులు మాత్రం ఫైనల్. దీనికి ఐసీసీతో పాటు అన్ని జట్లు కట్టుబడి ఉండాల్సిందే. అయితే చాలా పరిమితమైన విధానపరమైన కారణాల వల్ల తప్ప దీనికి అప్పీల్ చేసే హక్కు ఏ దేశానికీ లేదు. మరి బంగ్లాదేశ్ విజ్ఞప్తి ఈ కేటగిరీ కిందకు వస్తుందా లేదా అనేది ఐసీసీ తేల్చాల్సి ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ కు భారత్ లో మ్యాచ్ లు ఆడే విషయంలో 24 గంటల డెడ్ లైన్ ఇచ్చిన ఐసీసీ.. అది ముగిసినా ఇప్పటివరకూ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఆడకపోతే వారి స్ధానంలో స్కాట్లండ్ ను ఎంపిక చేసేందుకు ఐసీసీ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కేవలం రెండు వారాల గడువు మాత్రమే ఉన్నా ఇప్పటివరకూ ఐసీసీ కూల్ గా స్పందిస్తోంది. మరోవైపు ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇతర ఐసీసీ సభ్యదేశాలు కూడా ఆసక్తి చూపడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+