Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CWC 2025: మహిళల వరల్డ్ కప్ విజేతకు భారీ ప్రైజ్ మనీ..! పురుషుల టీం రికార్డులూ బద్దలు..!

భారత్ లో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇవాళ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ఈ రెండు జట్లూ ట్రోఫీ కోసం తాడోపేడో అన్నట్లుగా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ గెల్చుకునే వారికి ఈసారి రికార్డు స్దాయిలో ప్రైజ్ మనీ అందబోతోంది. చరిత్రలో గతంలో ఏ ప్రపంచ కప్ విజేతకూ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వలేదు.

ఇవాళ జరిగే మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికి ఏకంగా 4.48 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 39.78 కోట్ల రూపాయల నగదు బహుమతి లభించబోతోంది. ఇది గతంలో ఏ ప్రపంచకప్ గెల్చుకున్న వారికీ లభించనంత పెద్ద మొత్తం ఇది. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ గెల్చుకునే వారికి ట్రోఫీతో పాటు కాసుల పంటలేనని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై అంచనాల్ని మరింతగా పెంచేస్తోంది.

Women s Cricket World Cup 2025 Champion Set to Receive Historic Prize Money Surpassing All Records

ఈ ఏడాది సెప్టెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల ప్రపంచ కప్ 2025కు రికార్డు ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ప్రైజ్ పూల్ 13.88 మిలియన్ల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 123 కోట్లు). 2022లో గత ఎడిషన్ ప్రైజ్ పూల్ కంటే ఇది 297 శాతం ఎక్కువ. అలాగే వరల్డ్ కప్ విజేతకు ఇచ్చే నగదు బహుమతి 4.48 మిలియన్ డాలర్లు గత ఎడిషన్ కంటే 239 శాతం ఎక్కువ. ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 విజేతలకు అందించిన 4 మిలియన్ డాలర్ల బహుమతి రికార్డును కూడా అధిగమించింది. అలాగే రన్నరప్ కు విన్నర్ కు ఇచ్చే మొత్తంలో సగం అంటే 2.24 మిలియన్ డాలర్లు ఇస్తారు.

Women s Cricket World Cup 2025 Champion Set to Receive Historic Prize Money Surpassing All Records

టీమ్ ఇండియా ఇప్పటికే టోర్నీలో మూడు గ్రూప్ దశ విజయాల నేపథ్యంలో సుమారు రూ. 3.5 లక్షల డాలర్లు బహుమతిగా అందుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే 4 లక్షల డాలర్లు అందుకుంది. లీగ్ దశలో భారత్ కంటే రెండు విజయాలు ఎక్కువగా సాధించడమే ఇందుకు కారణం. ఈ లెక్కన చూస్తే ఫైనల్ కూడా గెలిస్తే టీమిండియా 42 కోట్లకు పైగా అందుకున్నట్లు అవుతుంది. దీనికి అదనంగా బీసీసీఐ పురుషులతో సమానంగా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే మహిళలకూ 125 కోట్ల నజరానా ఇవ్వబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+