ఘోర పాలనపై దూరవాణి

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 03-06-2005

హైదరాబాద్‌:విప్లవ రచయితల సంఘం సభ్యులు చెంచయ్య,ఎన్‌ వేణుగోపాల్‌, పినాకపాణి, సోమా రవికుమార్‌లనుఅరెస్టు చేయడంపై వివిధ వర్గాల నుంచివ్యతిరేకత వ్యక్తమవుతోంది.రాష్ట్రంలోని మేధావులు ప్రగతిశీల భావాలుగల వారితో పాటు ప్రవాసాంధ్రులు కూడా ఈఅరెస్టులను ఖండిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోప్రజా కవులు, రచయితలపై,పౌరహక్కుల నేతలపై కాంగ్రెస్‌ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నపోలీసు దాడులు ఆందోళన కలిగించేపరిణామమని ప్రవాసాంధ్రులు సాజీ గోపాల్‌,నారాయణ స్వామి, గాంధీ ఒక ప్రకటనలోపేర్కొన్నారు. ప్రజల సమస్యలనుప్రజాస్వామికంగా పరిష్కరించకుండాముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పోలీసుతుపాకులతో అణిచివేత సాగిస్తూ, రెండువేల మందిని చంపిన నరహంతకచంద్రబాబు పాలనను పునరావృతంచేస్తున్నారని వారు విమర్శించారు.ఎన్‌కౌంటర్‌ హత్యలతో తెలంగాణపల్లెలను రాయలసీమ గ్రామాలను,పల్నాడుతో సహా కోస్తా జిల్లాలను మళ్ళీరక్తంలో ముంచెత్తుతున్నారనిపేర్కొన్నారు.

సామాజికస్పృహతో రచనలు సాగిస్తూ ప్రజాఉద్యమాల్లో పాల్గొనే కవులపైన,రచయితలపైన పోలీసు దాడులు చేస్తూఅక్రమ కేసులు పెడుతున్నారనిప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం రాజకీయ స్వేచ్ఛనుహరిస్తూ, సాహిత్య వ్యక్తీకరణలనుకాల రాస్తూ, ప్రజలకు ఉండే కనీస నిరసనహక్కుని సైతం అణగదొక్కుతూ,ప్రజాస్వామ్య విలువలనుమటగలుపుతోందని వారువిమర్శించారు.

కాంగ్రెస్‌ప్రభుత్వం బహిరంగ సభలను,ఊరేగింపులను నిషేధిస్తూపౌరహక్కులనుకాలరాస్తోందన్నారు. ప్రవాసభారతీయులుగా తాము సాహిత్యకారులపైన ప్రభుత్వ నిర్బంధాన్ని, పోలీసుదాడులను, అక్రమ అరెస్టులనుఖండిస్తున్నామని పేర్కొన్నారు.ప్రపంచీకరణ ప్రభావంపైఅమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌ పుస్తకంరాసిన వేణుగోపాల్‌, రాయలసీమజీవితాలను ప్రతిబింబిస్తూ నిప్పులవాగునవల రాసిన పినాకపాణి, అరుణతారమాజీ సంపాదకుడు చెంచయ్య,రచయిత రవికుమార్‌లను వెంటనేవిడుదల చేయాలని, అక్రమ కేసులుఎత్తేయాలని సాజీ గోపాల్‌, నారాయణ స్వామి,గాంధీ కోరారు. ఆంధ్రప్రదేశ్‌కాంగ్రెస్‌ ప్రభుత్వ ఫాసిస్టు చర్యలనుఖండించవలసిందిగా వారుప్రజాస్వామ్యవాదులకు, ప్రవాసాంధ్రులకు,విద్యార్ధులు, దళితులు, వెనుకబడినవర్గాలు, మైనారిటీలకు అప్పీలు చేశారు.

గమనిక:ప్రజా రచయితల అరెస్టును ఖండిస్తూపంపిన మెయిల్స్‌నుదట్స్‌తెలుగు డాట్‌కాంలో ప్రచురిస్తాం.మీ మెయిల్స్‌ పంపాల్సిన ఐడి :[email protected]- ఎడిటర్‌

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+