చిరంజీవిపై రాజశేఖర్ నిప్పులు

చిరంజీవి పదవి కోసం, పార్టీ టికెట్లు అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చారే కానీ ప్రజాసేవ కోసం కాదని రాజశేఖర్ వచ్చీ రాని తెలుగులో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం వేరని, చిరంజీవి ఆయనతో ఏ మాత్రం సరిపోలరని జీవిత వ్యాఖ్యానించింది. ఇతరులకు సహాయపడదామన్న ఆలోచన ఏనాడూ చిరంజీవికి రాలేదని, తన వల్ల నష్టపోయిన నిర్మాతలను ఆయన రజనీకాంత్ లాగా ఏనాడూ ఆదుకోలేదని ఆయన అన్నారు.
తమ కారుపై చిరంజీవి అభిమానులు దాడి చేసినఫ్ఫుడు మాకు అనుకూలంగా ప్రజాస్పందన చూసి కానీ చిరంజీవి దిగిరాలేదని, అయన వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని జీవిత అన్నారు. సినిమాల తర్వాత పదవి తనకు రాసి ఉందని చిరంజీవి భావిస్తున్నారు కానీ తన కు అర్హత ఉందా లేదా అన్న విషయం ఆలోచించడం లేదని రాజశేఖర్ చెప్పారు.












Click it and Unblock the Notifications