వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డికి మోరల్ బూస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నైతిక బలం చేకూర్చినట్లేనని భావిస్తున్నారు. తెలంగాణవాదం కారణంగా కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస గౌడ్‌కు డిపాజిట్ కూడా దక్కకపోవచ్చుననే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అనూహ్యంగా శ్రీనివాస గౌడ్ ఓట్లను సాధించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డికి 49 వేల పైచిలుకు మెజారిటీ మాత్రమే లభించింది. శ్రీనివాస గౌడ్ అసలు ఊసులోనే ఉండరని భావించారు. అందువల్లనే బాన్సువాడలో అభ్యర్థిని పోటీకి దించవద్దని కాంగ్రెసు తెలంగాణ నాయకులు గట్టిగా వాదిస్తూ వచ్చారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పోటీకి విముఖత ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టడం వల్లనే కాంగ్రెసు పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించాల్సి వచ్చింది.

అందరూ వ్యతిరేకిస్తున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని పట్టుబట్టిన ఫలితం దక్కిందని అంటున్నారు. నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత కాంగ్రెసు అధిష్టానం అంచనాలను అందుకోలేకపోతున్నారనే అభిప్రాయం బలంగానే ఉంది. ఈ ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో బాన్సువాడ ఉప ఎన్నిక ఆయనకు కలిసి వచ్చినట్లే భావించాలి. బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితం చూస్తే ఎన్నికలు జరిగితే ఫలితాలు ఏకపక్షాన ఉండబోవని తేల్చి చెప్పినట్లయింది. ఎన్నికలు వస్తే తెరాస ఏకపక్షంగా స్వీప్ చేస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితం చూస్తే తెరాసకు ఎన్నికలను ఎదుర్కోవడం అంత సులభం కాదనే అంచనాలు సాగుతున్నాయి.

కాగా, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం వల్ల కాంగ్రెసు అభ్యర్థికి కలిసి వచ్చిందనే అంచనాలు సాగుతున్నాయి. అదే నిజమైతే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయిందనే వాదన బలహీనపడుతుంది. బాన్సువాడ ఉప ఎన్నిక కేవలం తెలంగాణవాదంపైనే జరిగింది. స్థానిక పరిస్థితులు అంతగా పనిచేయలేదనే చెప్పాలి. అయితే, బిసి అంశం శ్రీనివాస గౌడ్‌కు కొంత కలిసి వచ్చిందనే అభిప్రాయం ఉంది. ఏమైనా, ముఖ్యమంత్రికి ఈ ఉప ఎన్నిక ఫలితం తీరు ఊరట కలిగించిందనే చెప్పాలి.

English summary
Nizamabad bypoll result is a moral boost to CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X