వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాది రాష్ట్రాలకు సమ్మె ఎఫెక్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావం కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు తాకింది. సకల జనుల సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి నిలిపి వేయడంతో దక్షిణాదిన గల మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలపై సమ్మె ప్రభావం పడింది. బొగ్గు ఉత్పత్తి లేక పోవటంతో ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్లు కరెంట్ ఉత్పాదకను తగ్గించాయి. దీంతో రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడింది. ఎపితో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

మహారాష్ట్రలోని మూడు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గటంతో పరిమితంగానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరోవైపు తమిళనాడులో 20 శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. కర్నాటకలో 6400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా కేవలం 5400 మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో బెంగళూరులో రోజుకు నాలుగైదు సార్లు విద్యుత్ కోత విధిస్తున్నారు. కేరళలో 400 మెగావాట్ల విద్యుత్ కొరత, ఆంధ్రప్రదేశ్‌లో 1400 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోని పలు విద్యుత్ ప్లాంట్లు చిన్న చిన్న సంస్థల నుండి బొగ్గును కొనుగోలు చేస్తున్నప్పటికీ సమస్య తీవ్రత తగ్గటం లేదట.

విద్యుత్ కొరత పరిశ్రమలు, వ్యవసాయరంగం, ఐటి రంగంపై తీవ్రంగా పడుతోంది. విద్యుత్ కొరత కారణంగా ఐటి రంగం తీవ్రంగా నష్టపోతుందని సమాచారం. కేరళ ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు విద్యుత్ కోత విధిస్తోంది. ఇక మన రాష్ట్రంలో పట్టణాలు, మున్సిపల్, గ్రామాల వారిగా రోజుకు నాలుగు, ఎనిమిది, పది గంటల చొప్పున విద్యుత్ కోత విధిస్తున్నారు. రాయలసీమ విద్యుత్ ప్లాంటు సామర్థ్యం 1200 మెగావాట్లు కాగా కేవలం 800 మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే లక్ష టన్నుల సిఐఎం నుండి మంజూరు చేయించుకుంది. మరికొంత కావాలని ప్రభుత్వం అడగటంతో మిగిలిన రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట.

English summary
South India effected with Telangana Sakala Janula Strike. Current is going many time in Bangalore by strike effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X