షాజన్ పదాంసీతో శ్రీశాంత్ డేటింగ్?

షాజన్ పదాంసీ, శ్రీశాంత్ దక్షిణ ముంబైలో చాలా దగ్గరగా కూర్చుని తమకు కనిపించినట్లు చూసివారు చెప్పారని ముంబై మిర్రర్ పత్రిక రాసింది. ముంబై ఇండియన్స్‌తో ఈ నెల 15వ తేదీ కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు తలపడింది. కొచ్చి టస్కర్స్ తరఫున ఆడుతున్న శ్రీశాంత్ ముంబై వచ్చాడు. అప్పటి నుంచి ముంబై అంటే శ్రీశాంత్ ఎక్కడ లేని మక్కువ ఏర్పడిందని చెబుతున్నారు.
షాజన్ పదాంసీ శ్రీశాంత్‌తో కలిసి మ్యాచు ముగిసిన తర్వాత నగరాన్ని చుట్టినట్లు చెబుతున్నారు. శ్రీశాంత్‌తో కలిసి తిరుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించలేదని చెబుతున్నారు. శ్రీశాంత్‌తో కలిసి తిరుగుతున్నట్లు ఆమె అంగీకరిస్తోందని కూడా అంటున్నారు. శ్రీశాంత్, తాను మంచి మిత్రులమని, తన కెరీర్‌తో తాను బిజీగా ఉన్నానని, తాను సింగిల్‌గానే ఉన్నానని అంటోందట.












Click it and Unblock the Notifications