వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ గేమ్!: చిరుకు చిన్నల్లుడు శిరీష్ ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Sirish Bharadwaj
కేంద్రమంత్రి చిరంజీవికి శిరీష్ భరద్వాజ్ షాక్ ఇచ్చారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహం చేసుకొని శిరీష్ భరద్వాజ్ ప్రముఖంగా వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీజ, శిరీష్ భరద్వాజ్‌లు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో శ్రీజను పెళ్లాడిన ఈ శిరీష్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం ఆయన సుమారు రెండు వందల మంది యువతతో కలిసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగా ఉన్నారు. శ్రీజను పెళ్లి చేసుకోవడం వివాదాస్పదమైంది. వీరి పెళ్లిని శ్రీజ పెద్దలు అంగీకరించలేదనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విడాకుల వరకు వెళ్లడానికి కూడా వారే కారణమనే విమర్శలు ఉన్నాయి. చిరు కాంగ్రెసు పార్టీలో ఉండటంతో శిరీష్ బిజెపిలో చేరడం గమనార్హం.

శిరీష్ భరద్వాజ్ చేరికి బిజెపికి రాజకీయంగా కూడా లాభించవచ్చునని అంటున్నారు. వ్యక్తిగతంగా శిరీష్ ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. చిరుతో వచ్చిన మనస్పర్ధల వల్ల లబ్ధి చేకూరే అవకాశాలు కొట్టిపారేయలేమనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి శిరీష్ భరద్వాజ్ పొలిటికల్ షాక్ ఇచ్చారని అంటున్నారు. చిరుతో విభేదాల కారణంగా శిరీష్‌కు కొద్దికాలంగా రాజకీయ పార్టీల నుండి ఆహ్వానం అందినట్లుగా చెబుతున్నారు. చివరకు ఆయన బిజెపితో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

శుక్రవారం ఆయన పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ప్రభాకర్ తదితరుల సమక్షంలో పార్టీలో చేరారు. యువతలో దేశభక్తిని పెంపొందించడం కేవలం బిజెపికే సాధ్యమని, ఆ పార్టీ నేతలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని, లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలను ఆదర్శంగా తీసుకొని బిజెపిలో చేరినట్లు చెప్పారు.

English summary
Sirish Bharadwaj joined in Bharatiya Janata Party on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X