వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: నేటితో ముగియనున్న గడువు, ఇకపై ఆర్బీఐ వద్దకే!

రద్దయిన పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో (శుక్రవారం, డిసెంబర్ 30)తో ముగుస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: రద్దయిన పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో (శుక్రవారం, డిసెంబర్ 30)తో ముగుస్తోంది. అయితే రద్దయిన నోట్లను డిసెంబరు 30వ తేదీలోపు తమ అకౌంట్లలో డిపాజిట్‌ చేసుకోలేని వారు సరైన కారణాలను చూపి.. రిజర్వ్‌బ్యాంకు తమ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మార్చి 31వ తేదీ వరకు మార్పిడి చేసుకోవచ్చు.

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబరు 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. పార్లమెంటు సమావేశాలను పూర్తిగా అడ్డుకున్నాయి. నిరసనలు చేపట్టాయి. ఈ 50 రోజుల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పెద్ద నోట్ల రద్దుతో చిన్ననోట్లు అందుబాటులో లేక బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంకు తరచూ నిబంధనల్లో మార్పులు చేస్తూ... ప్రకటనలు విడుదల చేయడంతో అటు బ్యాంకర్లు, ఇటు ప్రజలు మరింత గందరగోళానికి గురయ్యారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి 50రోజులు గడుస్తున్నా ప్రజల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిపోలేదు.

Deadline To Deposit Old Rs. 500 And Rs. 1,000 Notes Ends Today

కాగా, రద్దయిన నోట్లను నవంబరు 10వ తేదీ నుంచి బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించాయి. కొత్తనోట్లకు అనుగుణంగా ఏటీఎంలలో తగిన మార్పులు చేయకపోడంతో.. కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేయడం ప్రారంభించాయి. వారానికి రూ.24 వేల వరకు, ఏటీఎంల ద్వారా రోజుకు రూ.2500 వరకు విత్‌డ్రాకు ప్రభుత్వం అనుమతించినా .. నగదు కొరత దృష్ట్యా అనేక బ్యాంకులు చాలా తక్కువ మొత్తాన్నే ఖాతాదారులకు చెల్లించాయి.

ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి కొంత మెరుగుపడినా.. ఏటీఎంల వద్ద క్యూలైన్లు మాత్రం తగ్గడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేసే మొత్తాలపై పరిమితులు డిసెంబరు 30వ తేదీ తర్వాత కూడా కొనసాగవచ్చునని బ్యాంకర్లు భావిస్తున్నారు. పరిమితులను ఎత్తివేస్తే.. మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.

విత్ డ్రా మొత్తాలపై పరిమితులుంటేనే అందరి అవసరాలకు డబ్బులు అందుతాయని, లేదంటే కొందరికే డబ్బు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
అయితే, నియంత్రణల్ని ఎప్పుడు ఉపసంహరిస్తారనే దానిపై ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. నేడో, రేపో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
The 50-day deadline to deposit the old Rs. 500 or 1,000 notes in banks comes to an end today but the cash crunch and queues before ATMs are likely to continue for some more time as currency printing presses have failed to meet the huge demand for new bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X