స్టాలిన్ ఖుషీ: మోడీ పేరు ఎత్తని రజనీకాంత్, ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశాలతో తమిళ రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో మంచి నేతలు ఉన్నారంటూ రజినీకాంత్ కొందరి పేర్లను మాత్రమే ప్రస్తావించారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో రజినీకాంత్ నోటి వెంట వస్తున్న ప్రతీ మాటను రాజకీయ పరిశీలకులే కాకుండా వివిధ పార్టీల నాయకులు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఆయన తీసుకునే రాజకీయ మార్గం ఏమిటనే విషయంపై ఆసక్తి నెలకొనడమే అందుకు కారణం.

బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి వంటి నాయకులు ఇప్పటికే ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ స్థానికుడు కాదని ఆయన అన్నారు. ఆయనను తమిళనాడు ముఖ్యమంత్రిగా అంగీకరించబోరని అన్నారు.

స్టాలిన్ ఆనందం...

స్టాలిన్ ఆనందం...

తనను మంచి సమర్థుడైన నాయకుడిగా రజనీకాంత్ అభివర్ణించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. అంతేకాకుండా అన్నాడియంకె, బిజెపి, కాంగ్రెస్ నేతల పేర్లను రజనీకాంత్ ప్రస్తావించలేదు. తన రాజకీయ మిత్రుడైన ప్రధాని మోడీ పేరును కూడా రజినీకాంత్ ప్రస్తావించలేదు. ఇది కూడా స్టాలిన్‌కు ఆనందాన్నిచ్చి ఉంటుంది. రజినీకాంత్ తమ రాజకీయ ప్రత్యర్థుల వెంట వెళ్లే అవకాశం లేదనే సంకేతాలను ఇచ్చారని స్టాలిన్ బహుశా ఆనందపడుతూ వుండవచ్చు.

బిజెపి నేతల గుర్రు...

బిజెపి నేతల గుర్రు...

రజనీకాంత్ తన నోటి వెంట ప్రధాని పేరును ప్రస్తావించకపోవడంపై బిజెపి నాయకులు మండిపడుతున్నట్లు కనిపిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని రజినీకాంత్ ఎందుకు ప్రశంసించలేదని బిజెపి తమిళనాడు అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు.

అన్నాడియంకె నేత ఇలా...

అన్నాడియంకె నేత ఇలా...

తనపై వచ్చిన ఒక్క విమర్శనే రజినీకాంత్ తట్టుకోలేకపోయారని, రాజకీయాల్లోకి వస్తే ఇలాంటివి ఎన్నో భరించాల్సి ఉంటుందని అన్నాడియంకె పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన మాజీ మంత్రి కెపి మునుస్వామి అన్నారు. కేవలం నటనా నైపుణ్యాలు మాత్రమే రాజకీయాలకు సరిపోవన్నారు. రాజకీ యాల్లో రాణించడం సినిమాల్లో నటించినంత సులభం కాదని రజనీ అర్థం చేసుకోవాలని సూచించారు. రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే సినిమాల్లో నిలదొక్కుంటారని, నటులకు ప్రజల సమస్యలు, రాష్ట్ర పరిస్థితులు తెలిసే అవకాశం లేదని మునుస్వామి అన్నారు.

ఎందుకు పట్టించుకోలేదు...

ఎందుకు పట్టించుకోలేదు...


దేశం మొత్తం మీద తమిళనాడులోనే శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని రజినీకాంత్ తెలుసుకోవాలని అన్నాడియంకె (అమ్మ) ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ అన్నారు. దేశంలోని శాంతి భద్రతలను పరిరక్షించి, ప్రశాంత వాతావరణంతో ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిన రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానం లో ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సమయంలో, అంత్యక్రియల సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్న విషయం రజనీకి తెలియక పోవడం దురదృష్టకరమని అన్నారు. జల్లికట్టు సమస్య కోసం చెన్నై మెరీనా బీచ్‌లో లక్షలాది మందితో చేపట్టిన ఉద్యమంలో కూడా రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకు భంగం కలగలేదని, ఆయుధాలపై నమ్మకం ఉంచుకున్న మావోయిస్టులు, తీవ్రవాదులు రాష్ట్రంలో ప్రవేశించలేకపోతున్నారని, ఈ వాస్తవాలను మరుగున పరచి రజనీ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పిన రజనీ కాంత్‌ దాన్ని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నించలేదని నాంజిల్‌ సంపత్‌ ప్రశ్నించారు.

రజినీ నిరక్షరాస్యుడు...

రజినీ నిరక్షరాస్యుడు...

రజనీకాంత్ రాజకీయాలకు పనికిరాడని బీజేపీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి అన్నారు. రజనీ నిరాక్షరాస్యుడని, విద్యాధికులైన తమిళ ప్రజలు ఆయనను సీఎంగా చూడలేరని స్వామి వ్యాఖ్యానించారు. బీజేపీ ఒకవేళ రజనీతో పొత్తు పెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని, అప్పటికీ పొత్తు కొనసాగిస్తే అది పార్టీ అధిష్టానం ఇష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రజనీకి రాజకీయాల్లో భవిష్యత్ లేదని అన్నారు. తమిళనాడులో చదువుకున్న కొత్త తరం వచ్చిందని, తమిళ ప్రజలు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. (

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DMK leader Stalin is happy with Tamil Super star Rajinikanth for praising him.
Please Wait while comments are loading...