సూపర్ హీరోగా కెసిఆర్ మనవడు హిమాన్షు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మనువడు, మంత్రి కెటి రామారావు తనయుడు హిమాన్షు సూపర్ హీరోగా దర్శనమివ్వబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మించనున్న 'సూపర్ హార్ట్' షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు లిటిల్ హీరో పాత్ర పోషిస్తున్నాడు.
సాంఘిక దురాచారాలను రూపుమాపడం, సామాజిక బాధ్యతలను తెలియజెప్పడం ఇతివృత్తంగా ఆరు నుంచి పది నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఏసియన్ స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరున్న మనోజ్ చోప్రా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా సూపర్ హీరో పాత్రల్లో ఒకరిగా హిమాన్షుకు అవకాశం లభించింది.

వివిధ దేశాలకు చెందిన మరో ఆరుగురు సూపర్ హీరోలు ఇందులో నటించనున్నారు. బాలకార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అవినీతి, లంచగొండితనం, మద్యపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఫైట్లు చేసే అద్భుతమైన సూపర్ హీరో స్టంట్‌లు ఇందులో ఉంటాయి.

యున్‌డబ్ల్యూటీవో షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం ఈ చిత్ర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితోపాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, మనోజ్ చోప్రా పాల్గొన్నారు.

స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ప్రారంభోత్సవానికి హిమాన్షు హాజరు కాలేకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మార్చి 22 నుంచి జరిగే చిత్ర నిర్మాణంలో హిమాన్షు పాల్గొననున్నాడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications