జిగ్రీ దోస్త్ వినోద్ కాంబ్లీపై టెండూల్కర్ వ్యాఖ్యలు
లండన్: తన బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరు విభిన్నమైన జీవనశైలి గల విభిన్నమైన వ్యక్తులమని ఆయన అన్నాడు. టెండూల్కర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పోతుంటే కాంబ్లీ తన సామర్థ్యాన్ని ఆచరణలో చూపించలేకపోయాడు.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించి కాంబ్లీ 17 టెస్టులతోనే సరిపెట్టుకున్నాడు. ఇంగ్లాండుపై, జింబాబ్వేపై అతను 1993లో సెంచరీల మీద సెంచరీలు చేశాడు. తాను ప్రతిభ గురించి మాట్లాడదలుచుకోలేదని, దాన్ని చేప్పే తీర్పరిని తాను కానని సచిన్ టెండూల్కర్ కాంబ్లీ గురించి మాట్లాడుతూ అన్నాడు.

ఓ ఆంగ్ల దినపత్రికతో కాంబ్లీ గురించి తన అభిప్రాయాలను టెండూల్కర్ పంచుకున్నాడు. విభేదాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు విభిన్నమైన జీవనశైలుల గురించి మాట్లాడాల్సి వస్తుందని అన్నాడు. భిన్నమైన స్వభావాలు గల ఇద్దరు వ్యక్తులమని అన్నాడు. పలు సందర్భాల్లో తాము ప్రతిస్పందించిన తీరు భిన్నంగా ఉండేదని అన్నాడు.
తన విషయానికి వస్తే, తన కటుంబం ఎప్పుడూ తనపై కన్నేసి ఉంచేదని, అన్ని వేళలా తనను పరిశీలిస్తూ ఉండేదని, ఈ విషయంలో తాను వినోద్ గురించి మాట్లాడలేనని అన్నాడు. పాఠశాల స్థాయి క్రికెట్‌లో ఈ ఇద్దరు కలిసి 664 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాంబ్లీ తన 23 ఏళ్ల ప్రాయంలో 1995లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.












Click it and Unblock the Notifications