పోటీపై వెనక్కి: పవన్ కళ్యాణ్ లెక్క తప్పిందా?

హైదరాబాద్: నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ హిట్ డైలాగ్. పవన్ కళ్యాణ్ నిజజీవితానికి కూడా అది సరిగా సరిపోతుందని అంటుంటారు. అయితే, రాజకీయ ప్రవేశం చేసి, జనసేన పార్టీ స్థాపించిన విషయంలో పవన్ కళ్యాణ్ లెక్క తప్పిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాజకీయ పార్టీని అత్యంత ఉత్కంఠభరితమైన నేపథ్యంతో స్థాపించి, చివరికి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దాంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు.

ఓట్లు చీలకుండా ఉండడానికే తాను తన పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దించడం లేదని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం సభలో చెప్పారు. అయితే, అది అంత హేతుబద్దమైన కారణంగా కనిపించడం లేదు. బిజెపి, తెలుగుదేశం, లోకసత్తా పార్టీలతో కలిసి పోటీ చేసినప్పుడు ఓట్లు చీలే అవకాశం ఎంత మాత్రం ఉండదు. బిజెపి, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇస్తున్నారని భావిస్తున్న పవన్ కళ్యాణ్ వాటితో సర్దుబాటు చేసుకున్నప్పుడు ఓట్లు చీలే సమస్య అనేది ఎలా వస్తుందనేది అర్థం కావడం లేదు.

Pawan Kalyan not prepared for politics?

అయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు సమయం సరిపోలేదనేది మాత్రం వాస్తవం. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను లక్ష్యం చేసుకుని వాటిని ఓడించే ఉద్దేశమే ఆయన మాటల్లో కనిపించింది. ఆ పార్టీలను ఓడించడానికి బిజెపి, తెలుగుదేశం కూటమికి మద్దతు ఇస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టంగా చెప్పారు.

పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోవడం తమకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని తెలుగుదేశంతో కలిసి పనిచేస్తే ఎక్కువ ప్రయోజం ఉండేదనే భావన వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్‌కు సీట్లు కేటాయించే విషయంలో మాత్రం సమస్య తలెత్తేది. తెలుగుదేశం బలంగా ఉన్న కొన్ని సీట్లను ఆయన కోరుకున్నట్లు చెబుతారు. విజయవాడ, మల్కాజిగిరి వంటి లోకసభ స్థానాలను ఆయన అడిగినట్లు చెబుతారు. కానీ, అది సాధ్యపడే విషయం కాదని తేలిపోవడం కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గడంలోని ఆంతర్యమని అంటున్నారు.

దానికితోడు, మెగా అభిమానులు రాజకీయంగా చిరంజీవికి మద్దతు ఇస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాలను ఆదరిస్తామని ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ మరో సోదరుడు నాగబాబు చిరంజీవి వైపు నిలిచారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ స్పష్టంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుటుంబంలో అనవసరమైన ఘర్షణకు తావు ఇవ్వడం ఎందుకని కూడా వెనక్కి తగ్గి ఉండవచ్చునని అంటున్నారు.

అయితే, రాజకీయాల్లో మాత్రం ఆయన తన స్థానాన్ని భవిష్యత్తులో పదిలపరుచుకోవడానికి వేదికను తయారు చేసుకున్నట్లు భావిస్తున్నారు. సినిమాల్లో నటించలేని స్థితి వచ్చినప్పుడు అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వస్తే 2019 ఎన్నికలను లక్ష్యం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల నాటికి జనసేనకు పూర్తి స్థాయి నిర్మాణాన్ని, నాయకత్వాన్ని, శ్రేణులను తయారు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+