హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు పడిపోయిన అమితాబ్, సీఎంపై నాగార్జున!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదని, ఇక్కడే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం భరోసా ఇచ్చారు.

సందిగ్దంలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ అనుమానాలు పటాపంచలు చేసేలా, సినిమా పెద్దలను ఆకట్టుకునే విధంగా కేసీఆర్ ప్రకటన చేశారు.

తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు, ఇక్కడే ఉంటుందన్నారు. సినిమా పరిశ్రమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కోరుతుందో చెప్పండి, చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డు బహూకరణ సభ శనివారం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ చేతుల మీదుగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అక్కినేని నాగేశ్వర రావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన అవార్డు బహూకరణ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సభకు మీడియాను అనుమతి లేదు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే తెలుగు సినిమావారితో ఒక సమావేశాన్ని నిర్వహించి సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలో చర్చించనున్నట్టు ప్రకటించారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

ప్రభుత్వం పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని, ఇప్పుడున్న సినిమా పరిశ్రమ ఇక్కడే ఉండటంతో పాటు జాతీయస్థాయిలో అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. దీనికోసం ఏం చేయాలో కలిసి చర్చిద్దామన్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలని, ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడుతామని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్‌ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం జ్ఞాపికను, రూ.5 లక్షల చెక్కును అమితాబ్ బచ్చన్ శనివారం అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆయనకు శాలువా కప్పి, ప్రశంసాపత్రాన్ని అందించారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

అమితాబ్‌ నటించిన అభిమాన్‌ సినిమాను నేను 50 సార్లకుపైగా చూశానని, షోలే కూడా చాలాసార్లు చూశానని, ఆయన లెజండరీ ఆర్టిస్టు అని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

ఆయన పాత్రల్లో నటించరని, జీవిస్తారని కేసీఆర్ అన్నారు. ఆయనకు నా చేతుల మీద అవార్డు ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదని కేసీఆర్‌ తన ప్రసంగంలో బిగ్‌బీని కొనియాడారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో కీలక పాత్ర పోషించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని ప్రశంసించారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

మొన్నమొన్నటిదాకా హైదరాబాద్‌కి తరలివచ్చిన చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు బాగా స్థిరపడిందని, ముంబై కన్నా ఇక్కడే ఎక్కువ సినిమాలను తెరకెక్కిస్తారని తెలిసిందని, ఇటీవలే రామోజీ ఫిలిం సిటీని చూశానని, ఏడాదికి 200 పైచిలుకు చిత్రాల షూటింగ్‌ అక్కడ జరుగుతుందని తెలిసిందని కేసీఆర్ అన్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

‘‘అక్కినేని అవార్డును అం దుకోవడం మహదానందంగా ఉంది. ఆయనతో ఎన్నో అపు రూప క్షణాలను గడిపాను. ఏఎన్నార్‌ చాలా నిరాడంబరుడు. సమాజం ఆదరించడం వల్లనే ఈ స్థానంలో ఉన్నామని.. కాబట్టి సమాజానికి చేతనైనంత సాయాన్ని తిరిగి చేయాలని నమ్మే వ్యక్తి ఆయన. నేను కూడా అదే నమ్మాను'' అని అమితాబ్ అన్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

నాగార్జున మాట్లాడుతూ.. అక్కినేని అవార్డు ప్రదానోత్సవాన్ని కొనసాగించాలని మా నాన్నగారు మా దగ్గర మాట తీసుకున్నారు. ఆయన చివరిదశలో దాదాపు 30 రోజులు అమితాబ్‌ సినిమాలను చూస్తూ గడిపారని నాగార్జున చెప్పారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు అమితాబ్‌ సినిమాలను చూడమన్నారని నాగార్జున చెప్పారు. మా అబ్బాయిలు సినిమాల్లోకి వస్తామన్నపుడూ మా నాన్నగారు అమితాబ్‌ చిత్రాలనే చూడమన్నారు. నాన్నగారు నటించిన చివరి చిత్రం మనంలో అమితాబ్‌ నటించడం ఆనందంగా ఉందని అన్నారు.

 కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

కేసీఆర్ - అమితాబ్ - నాగార్జున

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమేనని నాగార్జున ఈ సందర్భంగా పేర్కొన్నారు.

English summary
CM K Chandrasekhar Rao almost pulled off a coup by enlisting the support of Amitabh Bachchan in promoting the interests of the newly formed State of Telangana when the latter called on him on Saturday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X