గంగూలీXరవిశాస్త్రి: మాజీల్లో విభజన, గంభీర్ తీవ్రవ్యాఖ్య
ముంబై: అనిల్ కుంబ్లేను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన విషయమై సౌరవ్ గంగూలీ - రవిశాస్త్రిల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనిపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. గౌతమ్ గంభీర్ రవిశాస్త్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
రవిశాస్త్రి మాటలు అతడి అసహనాన్ని మాత్రమే సూచిస్తున్నాయని, కోచ్‌గా అనిల్ కుంబ్లేనే సరైన ఎంపిక అని చెప్పారు. అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి ఏం చేశారో చెప్పాలన్నారు. రవిశాస్త్రి ఉన్న కాలంలో ప్రపంచ కప్‌తో పాటు, ట్వంటీ 20 వరల్డ్ కప్ కూడా టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చిందన్నాడు. విజయాలను మీఖాతాలో వేసుకొని, అపజయాలు నావి కావంటే కుదరదన్నారు.
అదే సమయంలో మాజీ లెజండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ రవిశాస్త్రిని సమర్థించినట్లుగా మాట్లాడాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా కాకపోవడంపై రవిశాస్త్రి బాధపడటానికి కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. కోచ్ ఎంపిక బోర్డు ద్వారా కాకుండా ఒక సెలక్టర్ అభీష్టానికి అనుగుణంగా సాగడం అతడిని బాధించి ఉంటుందని బేడీ అభిప్రాయపడ్డాడు.

ప్రధాన కోచ్ విషయంలో బీసీసీది సరైన ఎంపికేనని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. టీమిండియాకు ప్రస్తుతం మనసావాచా పని చేసే కోచ్ ఉన్నాడని, అనిల్ కుంబ్లేకు పని చేయడంలో మరో మార్గం తెలియదని, తనను కోచ్ పదవికి తిరస్కరించడంపై రవిశాస్త్రి ఆగ్రహంతో ఉన్నట్లుగా ఉన్నాడని, అతడికి ఇది కొత్త అనుభవమన్నాడు.
కాగా, కోచ్ పదవికి ఎంపిక జరుగుతున్న సమయంలో గంగూలీ అక్కడ లేడని రవిశాస్త్రి విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై గంగూలీ కూడా తీవ్రంగానే స్పందించాడు. రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచటంలో విహరిస్తన్నట్లు ఉన్నాడని, హద్దులో ఉంటే మంచిదని, ఇంటర్వ్యూ ఉంటే బ్యాంకాకులో షికార్లా అని గంగూలీ గరం అయ్యాడు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications