మరో ట్విస్ట్: స్వాతి హత్య మతమార్పిడి వల్లే...

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు మరో మలుపు తిరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. నాయకులు దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిఎంకె అధినేత కరుణానిధి కూడా రంగంలోకి దిగారు. విధుతలై చిరుతైగల్ కచ్చి (విసికె) నాయకుడు తిరుమావళవన్ కూడా స్వాతి హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఇరువురు నాయకులు కూడా డిమాండ్ చేశారు.

రామ్ కుమార్ గొంతు కోసుకోలేదని, పోలీసులు ఆ పనిచేశారని చెన్నై సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాన్ని కరుణానిధి లేవనెత్తారు. అసలు హంతకుడిని రక్షించడానికి తనను అరెస్టు చేశారని రామ్ కుమార్ ఆ పిటిషన్‌లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

స్వాతిని హత్య చేశానిలా: పోలీసులకు రామ్‌కుమార్, 'నిర్ధోషిగా నిరూపిస్తాం'

ఇదిలావుంటే, స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో జరిగిన స్వాతి హత్యకు కారణం ఏకపక్ష ప్రేమ కాదని, మతం మార్చుకొని ప్రేమించడం వల్లే ఈ దారుణం జరిగిందని డీసిఐ ప్రధానకార్యదర్శి తిరుమావళవన్ ఆరోపించారు. 2011ఎన్నికల సమయంలో ఆయన నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన కేసు విచారణలో బన్రూటి మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతోంది.

Swathi murder case: Leaders raise doubts over investigation

ఈ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా తిరుమావళవన్ కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మతం మార్చుకుని ప్రేమించుకునే వారు పరువు హత్యకు గురికావడం సీరియల్లా కొనసాగుతోందని అన్నారు.

నుంగంబాక్కం రైల్వేస్టేషనలో జరిగిన స్వాతి హత్యకు ఏకపక్ష ప్రేమ కారణం కాదని, మతం మార్చుకొని ప్రేమించడం వల్లే ఆమె హత్యకు గురైందని అభిప్రాయపడ్డారు. రామ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌లో స్వాతిని ఏకపక్షంగా ప్రేమించినట్టు ఎటువంటి సమాచారం లేదని, రాష్ట్ర పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు.

చెన్నై స్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా టెక్కీ హత్యలో ట్విస్ట్‌లు ఎన్నో!

ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే తన అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు.. ఈ కేసులో బిలాల్‌ మాలిక్‌ విషయంలో కూడా ముమ్మరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతి సోదరికి ఉద్యోగం ఇవ్వాలని,, కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

స్వాతి హత్య కేసును పోలీసులు విశాల దృష్టితో దర్యాప్తు చేయాలని పుతియా మిళగమ్ అధ్యక్షుడు కె. కృష్ణస్వామి ఇదివరకే డిమాండ్ చేశారు. రామ్ కుమార్ స్వాతిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అతనొక్కడే హత్య చేశాడా, ముక్కోణపు ప్రేమ వ్యవహారం ఇందులో ఏమైనా ఉందా అనే ప్రశ్నలకు జవాబులు వెతకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Political leaders, including DMK chief M. Karunanidhi and VCK president Thol. Thirumavalavan on Thursday raised doubts over police investigation into the murder of techie Swathi at Nungambakkam railway station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి