వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాగ్రహం: ఎన్నికల్లో ఒబామాకు చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

US snubs Obama in midterm polls in setback for Democrats
వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు ఉభయ సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, అధికార డెమోక్రటిక్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అమెరికా సెనేట్‌పై పూర్తి అధిపత్యం సంపాదించడమే కాకుండా ప్రతినిధుల సభలో తన మెజారిటీని మరింతగా పెంచుకుంది. ఈ ఫలితాలతో ఒబామా అధ్యక్ష పదవిలో మిగిలి ఉన్న రెండేళ్ల కాలం మరింత సంక్లిష్టంగా మారనుందంటున్నారు.

ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు సెనేట్‌లోని వంద స్థానాల్లో 36 సీట్లకు, దేశంలోని 50 రాష్ట్రాల్లోని 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. బుధవారం తాజా సమాచారాన్ని బట్టి రిపబ్లికన్ పార్టీ వంద సెనేట్ స్థానాల్లో 52 సీట్లను గెలుచుకోగా, డెమోక్రాట్లు 45 సీట్లను దక్కించుకున్నారు. మరోవైపు ప్రతినిధుల సభలో సైతం రిపబ్లికన్లు తమ మెజారిటీని గణనీయంగా పెంచుకోనున్నారు.

మొత్తం 435 స్థానాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 235 స్థానాల్లో అధిక్యతలో ఉండగా, డెమోక్రాట్లు 157 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. గత ప్రతిధుల సభలో డెమోక్రటిక్ పార్టీకి 199 స్థానాలు ఉండగా, రిపబ్లికన్ పార్టీకి 233 సీట్లు ఉండేవి. ఎనిమిదేళ్ల తర్వాత మొట్టమొదటిసారి అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించడంతో రెండోసారి పదవీకాలంలో మిగిలి ఉన్న రెండేళ్ల కాలం పరిపాలన సాగించడం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కష్టంగా మారవచ్చునంటున్నారు.

కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఒబామాను చేతగాని అధ్యక్షుడిగా అభివర్ణించడం మొదలుపెట్టారు కూడా. అయితే ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్ గట్టిగా తిప్పి కొడుతోంది. ఒబామా ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తికి అద్దం పట్టే తీరులో ప్రజలు పెద్ద ఎత్తున రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఆ పార్టీ ప్రతినిథుల సభలో తన మెజారిటీని మరింత పెంచుకోవడమే కాకుండా శక్తివంతమైన సెనేట్‌పై కూడా ఆధిపత్యాన్ని సాధించింది.

నార్త్ కరోలినా, ఆర్కాన్సాస్, కొలరెడోలలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత సభ్యులను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడించడమే కాకుండా, డెమోక్రాట్ల సభ్యులు రిటైర్ కావడంతో ఖాళీ అయిన వెస్ట్ వర్జీనియా, సౌత్ డకోటా, మోంటానా స్థానాల్లో కూడా గెలుపొందారు. లోవా సెనేట్ స్థానానికి నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోటీలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జానీ ఎర్నెస్ట్ విజయం సాధించారు.

డెమోక్రటిక్ పార్టీకి బలమైన స్థానాలుగా భావించే పలు రాష్ట్రాల్లోని గవర్నర్ పదవులను కూడా ఆ పార్టీ గెలుచుకుంది. డెమోక్రటిక్ పార్టీకి కంచుకోటలుగా భావించే మేరీలాండ్, ఇల్లినాయిస్ రాష్ట్రాల గవర్నర్ పదవులను రిపబ్లికన్ పార్టీ దక్కించుకోవడం దేశంలో రిపబ్లికన్ పార్టీ గాలి బలంగా వీస్తోందనడానికి స్పష్టమైన సంకేతమంటున్నారు.

English summary
The lone Indian-American in the US Congress appeared to have lost his seat in a nationwide Democratic rout on Tuesday that saw the Republican Party take control of the Senate, expand their hold on the House of Representatives, and win a raft of governorships.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X