• search

పొత్తుకు కెసిఆర్, చంద్రబాబు సై: ‘వెల్‌కమ్’ సూత్రధారులు వీరే

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పొత్తుల గురించి అధికార పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి. ప్రత్యేకించి 'వెలమ', 'కమ్మ' సామాజిక వర్గాల మధ్య ఐక్యత కోసం ఇరు పార్టీల నేతలు ముందడుగు వేశారు.

  ఇటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అత్యంత విశ్వాసపాత్రుడు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అటు ఏపీలో అధికార టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గరికపాటి మోహనరావు చొరవ చూపారు.

  తుమ్మల నాగేశ్వర్ రావు, గరికపాటి మోహనరావు అత్యంత సన్నిహిత బంధువులు. 2014లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు గరికపాటి మోహన్‌రావు ఎన్నికయ్యారు. ఇదే గరికపాటి మోహనరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యతిరేకించడం గమనార్హం.

   Revanth Reddy Surprise Call to TRS Minister Harish Rao - Oneindia Telugu
    వారిద్దరికి అధికారమే ప్రధానమే

   వారిద్దరికి అధికారమే ప్రధానమే

   మరో గమ్మత్తేమిటంటే ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరొందిన రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 1995 - 2014 వరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. తెలంగాణ సీఎం కేసీఆర్ మినహా మిగతా వారంతా ‘కమ్మ'టి సామాజిక వర్గ నేతలే కావడం ఆసక్తికర పరిణామం. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు ఏపీ సీఎం చంద్రబాబులకు అధికారం వారి చేతిలో ఉండటమే ప్రధానమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

    టీఆర్ఎస్, టీడీపీ మధ్య సుదీర్ఘ చర్చలు

   టీఆర్ఎస్, టీడీపీ మధ్య సుదీర్ఘ చర్చలు

   2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఓటుకు నోటు' కేసులో చిక్కిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ సీఎం కేసీఆర్.. రెడ్ హ్యాండెడ్ ప్రజల ముందు దోషిగా నిలిపిన తర్వాత ఆగమేఘాలపై చంద్రబాబు తన రాజకీయ, పాలనా కార్యకలాపాలను విజయవాడకు మార్చేశారు. ఏడాది అహర్నిశలు కష్టపడి 2016లోనే సచివాలయం, పిమ్మట అసెంబ్లీ భవన నిర్మాణాలు పూర్తి చేసేశారు. తాజాగా పాలనా వ్యవహారాలన్నీ బెజవాడ, అమరావతి కేంద్రంగానే సాగిస్తున్నారు. కానీ రెండేళ్ల తర్వాత హఠాత్‌గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మధ్య.. వెలమ, కమ్మ సామాజిక వర్గాల కొత్తగా కుదిరిన ‘కొత్త స్నేహా'నికి అర్థమేమిటో, నేపథ్యమేమిటో తెలియడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత టీడీపీ, టీఆర్ఎస్ మధ్య భారీ స్థాయిలోనే తెర వెనుక చర్చలు, సంప్రదింపులు జరిగాయని చెప్తున్నారు.

    ఫిరాయింపులపై హైకోర్టులో ఎర్రబెల్లి పిటిషన్ ఇలా

   ఫిరాయింపులపై హైకోర్టులో ఎర్రబెల్లి పిటిషన్ ఇలా

   ఇరు పార్టీల తరఫున తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఏపీ తరఫున రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు విస్త్రుత ప్రాతిపదికన భారీగా చర్చలు జరిపారు. ఇదీ కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా అప్పటి టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాకే జరిగింది. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ‘టీఆర్ఎస్' పార్టీ ‘కారు' ఎక్కేశారు. ఎర్రబెల్లి స్థానే టీడీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. ఫిరాయింపుదార్ల అనర్హత కోసం పిటిషన్ దాఖలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు వద్దని నిలువరించారని సమాచారం.

    ముందు మోత్కుపల్లి.. తర్వాత గరికపాటికి రాజ్యసభ సీటు

   ముందు మోత్కుపల్లి.. తర్వాత గరికపాటికి రాజ్యసభ సీటు

   తుమ్మల నాగేశ్వర్ రావు, గరికపాటి మోహన్‌రావు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు టీడీపీకి కేటాయించేందుకు టీఆర్ఎస్ అంగీకరించినట్లు సమాచారం. 2019లో గెలుపొందితే రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, 2020లో గరికపాటి మోహన్ రావుకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం కల్పించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సుముఖత వ్యక్తం చేసింది.

    వెల్‌కం ప్రతిపాదనకు రేవంత్ తదితరులు వ్యతిరేకత

   వెల్‌కం ప్రతిపాదనకు రేవంత్ తదితరులు వ్యతిరేకత

   దీనికి ప్రతిగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లను మళ్లించాలన్నది రాజీ ప్రతిపాదన. ఇప్పటి వరకు టీఆర్ఎస్‌తో అనునిత్యం ఘర్షణకు పడుతున్న రేవంత్ రెడ్డి, ఇతర రెడ్డి సామాజిక వర్గానికి టీడీపీ - టీఆర్ఎస్ మధ్య కుదిరిన అవగాహన ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. టీడీపీ - టీఆర్ఎస్ పార్టీల పొత్తు ప్రతిపాదనపై మౌనంగా ఉండేందుకు సిద్ధంగా లేక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నందున దాని కోసం వ్యూహాత్మకంగా తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని అభిలషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పొత్తు విషయమై ఎటువంటి ప్రకటన చేయొద్దని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు హితబోధ చేశారే గానీ పొత్తు ఉండదని మాత్రం ప్రకటించలేదు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చారు టీడీపీ అధినేత.

    కేసీఆర్ ద్వారా సీమాంధ్రలో టీడీపీకి మద్దతు?

   కేసీఆర్ ద్వారా సీమాంధ్రలో టీడీపీకి మద్దతు?

   ఇటీవల అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం పెళ్లి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వేర్వేరు భేటీల సారాంశమే 2019లో ఎన్నికల పొత్తును బయటపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వడం తప్పనిసరని టీడీపీ భావిస్తున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంతో సీమాంధ్రలోని తెలంగాణ ప్రజల మద్దతును ఏపీలో టీడీపీకి అనుకూలంగా కూడగట్టాలని చంద్రబాబు తలపోస్తున్నారు.

    టీడీపీ పొత్తుతో గత్యంతరం లేదని గులాబీ బాస్ ఇలా

   టీడీపీ పొత్తుతో గత్యంతరం లేదని గులాబీ బాస్ ఇలా

   ఉద్యోగాలు, ప్రొఫెషన్ రీత్యా హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాసులే. హైదరాబాద్ నగరం, దాని శివారుల్లో నివసిస్తున్న సీమాంధ్రకు చెందిన లక్షల కుటుంబాల్లో చాలా మంది తమ కుటుంబాలకు చంద్రబాబు మద్దతు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే వారంతా ఏపీలో టీడీపీకి ఓటేస్తున్న వారు కావడం గమనార్హం. ఇటు టీఆర్ఎస్ నాయకత్వం కూడా అందుకు అనుకూలంగానే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని గులాబీ బాస్ నిర్ణయానికి వచ్చారని వినికిడి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇరు రాష్ట్రాల సాధారణ పౌరులను తమ మద్దతుదారులుగా పరిగణించడమే విషాదకరం అంటే అతిశయోక్తి కాదు.

   English summary
   The latest buzzword doing rounds in the Telangana politics these days is 'VELKAM,' which sounds like 'welcome.' And the meaning of it is quite obvious: the new-found love between Velama and Kamma groups. To be more specific, it is the understanding between the Telangana Rashtra Samithi and the Telugu Desam Party. However, sources say it is not exactly a new-found love. Ever since TRS president and Telangana CM KCR dealt a master stroke on the TDP with the cash-for-vote scam two years ago and forced TDP president and AP CM Chandrababu to shift his base lock-stock-barrel to Vijayawada and Amaravati.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more