i Phone: యాపిల్ దీపావళి సేల్.. ఆ ఫోన్లపై భారీ తగ్గింపు..!
మీరు ఈ పండుగ సీజన్‌లో గాడ్జెట్‌లు లేదా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. ముఖ్యంగా ఐ ఫోన్ కొనాలని భావిస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే... Apple ఇండియా దీపావళి సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన iPhone 15 సిరీస్, అలాగే MacBook వంటి ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఎయిర్, ఐప్యాడ్‌లు, ఇతర పరికరాలు డిస్కౌంట్ ఇస్తోంది.
దీపావళి సేల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), ఢిల్లీలోని సాకేత్‌లోని టెక్ దిగ్గజం రిటైల్ అవుట్‌లెట్‌లలో అదుబాటులో ఉంది. ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా ఆఫర్‌లను పొందవచ్చు. కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపులను ఇస్తోంది. ఇతర బ్యాంక్ కార్డ్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికను అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

iPhone 15 సిరీస్ గత నెలలో వచ్చింది. ఈ సిరీస్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max ఉన్నాయి. ఐ ఫోన్ 15 ప్రారంభ ధర రూ.79,900, ఐ ఫోన్ 15 ప్లస్ రూ. 89,900, ఐ ఫోన్ 15 ప్రో రూ.1,34,900, ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ రూ.1. ,59,900గా ఉంది. అయితే ఈ సేల్ లో కస్టమర్‌లు iPhone 15 Pro, iPhone 15 Pro Maxలో ఒక్కొక్కదానిపై రూ6000 వరకు ఆదా చేసుకోవచ్చు. iPhone 15, iPhone 15 Plus పై రూ. 5000 తగ్గింపును పొందవచ్చు.
ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 14 ప్లస్, ఐ ఫోన్ 13, ఐ ఫోన్ ఎస్ఈ పై కూడా తగ్గింపును అందిస్తోంది. MacBook Air (M2 చిప్): ఈ సొగసైన, శక్తివంతమైన పరికరం రెండు వేరియంట్‌లు (13, 15-అంగుళాలు) ఉన్నాయి. వీటిపై రూ.10,000 తగ్గింపును ఇస్తున్నాయి. M1 చిప్‌తో MacBook Air పై రూ.8000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. iPad Pro, iPad Air 11, 12.9-అంగుళాల మోడల్‌లలో కస్టమర్‌లు రూ.5000 ఆదా చేసుకోవచ్చు. 10వ తరం ఐప్యాడ్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్, 9వ తరం పరికరంపై రూ.3000 ఉంది. iPad Mini పై రూ.3000 తగ్గింపు లభిస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications