ఐఫోన్ 15... రోజుకు రూ.130తో కొనండి
ఈ ఆధునిక ప్రపంచంలో యాపిల్ ఫోన్ యువత ఓ హోదాగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల నుంచి వచ్చే అనూహ్య స్పందనకు అనుగుణంగా యాపిల్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంటుంది. సరికొత్త మోడల్స్ ను విడుదల చేస్తుంటుంది. తాజాగా తన సిరీస్‌ను అప్‌డేట్ చేస్తూ ఐ ఫోన్ 15 ఫోన్ విడుదల చేసింది.
యాపిల్ లవర్స్, ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ సంవత్సరంలో యాపిల్ లవర్స్ కు అతిపెద్ద వేడుక ఏదైనా ఉందా? అంటే ఐఫోన్ 15 విడుదల కావడమే. ఫోన్ డిజైన్ ఎలా ఉంది? ఏ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి? ఇంకేమైనా అదనపు ఫీచర్లు యాడ్ చేశారా? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక ఈవెంట్లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15Pro Max, iPhone 15 Plus మోడళ్ల ను ఆపిల్ కంపెనీ విడుదల చేసింది. ఐఫోన్ 14 కంటే అడ్వాన్స్ ఫీచర్లను యాడ్ చేసింది. ఐఫోన్ 15 పవర్ ప్యాక్ ఫీచర్ కాంబోతో తీసుకువచ్చింది.

ప్రస్తుతం మార్కెట్ లోకి విడుదల అయిన ఐఫోన్ 15 భారతీయ వినియోగదారులకు చాలా ప్రత్యేకం. 'మేడ్ ఇన్ ఇండియా' ఐఫోన్లను విక్రయించడం ఇదే మొదటిసారి. దీన్ని కొనుగులు చేసేందుకు యువత ఎగబడుతోంది. మార్కెట్లో డిమాండ్ పెరిగేసరికి \"ఐ\" స్టేషన్ల లో దొరకడం చాలా కష్టం అవుతుంది.
అడ్వాన్స్ బుకింగ్ చేస్తూ ఎప్పుడు వస్తుందా? అంటూ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. అమెజాన్‌లో రూ.79,900 నుంచి ప్రారంభమవుతోంది. క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ఈఎంఐ పెట్టుకోవచ్చు. 24 నెలల సమయానికి నెలకు రూ.3,900 అవుతుంది. రోజుకు దాదాపు రూ.130 పొదుపు చేయాలి.. అప్పుడే ఐఫోన్ 15 మీ సొంతమవుతుంది.












Click it and Unblock the Notifications