Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Google Playstore పై మరిన్ని గేమ్స్..గేమర్స్‌కు గుడ్ న్యూస్..!

Online games:గేమర్స్‌కు ఇది నిజంగానే గుడ్‌న్యూస్ అని చెప్పాలి. జూలై 2024 నుంచి భారత్‌లో మరిన్ని ఎక్కువ గేమ్స్ యాప్స్‌కు గూగుల్ లైన్ క్లియర్ చేసేందుకు నిర్ణయించింది. ప్లే స్టోర్‌లో మరిన్ని గేమ్స్ అందుబాటులోకి రానున్నాయి. అందులో రియల్ మనీ గేమింగ్‌కు కూడా ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇది డెవలపర్స్‌కు ఒక చక్కని అవకాశం మారనుంది. గేమింగ్‌ ఇండస్ట్రీలో తమ క్రియేటివిటీని పరిచయం చేసేందుకు ఇదో చక్కటి వేదికగా తయారు కానుంది. అంతేకాదు ఇది భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అనుమతి ఉన్న రమ్మీ,డైలీ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఈ రియల్ మనీ గేమింగ్‌ను రన్ చేసేందుకు గూగుల్ డిసైడ్‌ అయ్యింది. సెప్టెంబర్ 2022లో రియల్ మనీ గేమింగ్‌ (RMG)కు ఎలాంటి స్పందన ఉందో తెలుసుకునేందుకు ఒక పైలట్ ప్రాజెక్టుగా గూగుల్ ప్రారంభించింది. దీంతో చాలామంది రియల్ మనీ గేమింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారనే అంశాన్ని గమనించడంతో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్ నిర్ణయించింది.

Play More, Play Now: Googles Play Store to Welcome a Wave of New Games

ఇక భారత్‌లో ఉన్న గేమర్స్‌కు కచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది. చైనా తర్వాత గేమర్స్ ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ రికార్డు కలిగి ఉంది. భారత్‌లో 42.5 కోట్ల మంది గేమర్స్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారీగా గేమర్స్ ఉండటంతో గేమింగ్ రంగంలో తమ మార్కెట్‌ను మరింత విస్తరింపజేసుకునేందుకు గూగుల్ ప్రణాళిక సిద్ధం చేసింది. అంతేకాకుండా ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 95శాతం ఆండ్రాయిడ్ ఫోన్లదే ఆధిపత్యం ఉండటంతో ఇది గూగుల్‌కు వరంగా మారనుంది.

అవకాశాలు-సవాళ్లు:

ఇక గేమింగ్ ఇండస్ట్రీలో ఉన్న డెవలపర్స్‌కు గూగుల్ ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చిందనే చెప్పాలి. డెవలపర్స్ ఇక్కడ సక్సెస్ అయితే గనుక వారు మంచి డబ్బులు సంపాదించేందుకు ఓ చక్కటి వేదికగా ఇది ఉపయోగపడుతుందని చెప్పాలి. 2027 నాటికి ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్ 1.2 బిలియన్ యూజర్లకు రీచ్ కానున్నట్లు అంచనా.అయితే 2019లో భారత గేమింగ్ ఇండస్ట్రీ ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇందుకు కారణం గేమింగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పై 28శాతం జీఎస్టీ విధించడమే. ఈ పన్ను విధించడం ద్వారా 3 బిలియన్ డాలర్ల ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గూగుల్ తన విస్తరణ ఆలోచనపై కూడా వెనక్కు తగ్గేలా చేసింది.

వినియోగదారులు వర్సెస్ లాభాలు:

ఆన్‌లైన్ గేమింగ్ అనేది ప్రపంచాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు కొన్ని మిలియన్ల మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నైపుణ్యత కలిగి ఉండి అవకాశాలు రాకపోవడంతో గేమింగ్ ఇండస్ట్రీ వృద్ధి చెందాల్సిన రీతిలో ముందుకు సాగడం లేదు. ఇందుకు కారణం ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు అదే సమయంలో కొన్ని నిర్ణయాలు ఇంకా పెండింగ్‌లో ఉంచడం. వేగంగా విస్తరిస్తున్న ఇండస్ట్రీలో వినియోగదారుల ఆసక్తిని బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఎందుకంటే ఇక ప్రపంచ రియల్ మనీ గేమింగ్ వైపు దూసుకెళుతోంది. దీంతో నష్టం వాటిల్లుతుందా, లేక లాభం చేకూరుతుందా అనేదానిపై ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+