ఆ కోడ్‌తో డెలివరీ బాయ్‌ను కాంటాక్ట్ అవుతున్నారా.. ఒక్క క్షణం ఆగండి(వీడియో)
ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీ వేగంతోపాటు మోసాలు కూడా ఊపందుకున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా.. మన బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. ఇదే తరహాలో డెలివరీ బాయ్ పేరుతో 401 కోడ్ చెప్పి జరగుతోన్న స్కామ్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకుంది ఓ మహిళ.
ఆన్లైన్ షాపింగ్ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చేతిలో ఫోన్ ఉంటేచాలు ఏం కావాలన్నా మన గుమ్మం దగ్గరకే వచ్చేస్తోన్న రోజులివి. తాజాగా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, ఆన్లైన్ మోసాలకు తెగబడుతున్నారు సైబర్ మోసగాళ్లు. ముందుగా వ్యక్తి ఫోన్ చేసి.. మీకు డెలివరీ వచ్చిందని చెబుతాడు. అయితే, తాము అడ్రస్ తెలుసుకునేందుకు ఇబ్బందిపడుతున్నామని అంటారు. మీకు దగ్గరలో ఉన్న డెలవరీ బాయ్‌కు అడ్రస్ గుర్తించడంతో సహాయం చేయాలని చెబుతారు. ఆ డెలివరీ సిబ్బందిని ఎలా సంప్రదించాలో చెబుతున్నట్టుగా చెబుతూ డెలివరీ బాయ్ నెంబర్ చెప్పి.. దానికి కాల్ చేసే ముందు 401 యాడ్ చేయాలని చెబుతారు. వారి సూచనలు పాటించామంటే.. మనకు తెలియకుండానే వారి ఉచ్చులో పడినట్లే.

వైరల్ వీడియో : ఈ తరహా మోసం నుంచి తాను ఎలా బయటపడ్డానో టిట్టర్లో చెప్పుకొచ్చింది ఒక మహిళ. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం.. ముందుగా సైబర్ నేరగాళ్లు తమ డెలివరీ బాయ్ అడ్రస్‌ను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పాడు. డెలివరీ బాయ్‌తో కనెక్ట్ అయ్యే ముందు అవసరమైన కంపెనీ ఎక్స్‌టెన్షన్ కోడ్‌గా 401 డయల్ చేయమని సూచించాడు. డెలివరీ చేసే వ్యక్తి ఫోన్ నంబర్‌కు ముందు ఈ కోడ్ డయల్ చేయమని చెప్పాడు. అయితే, ఇక్కడే, ఆమెకు సందేహం కలిగినట్లు చెప్పింది. వెంటనే ఆలస్యం చేయకుండా అసలు 401 కోడ్ ఏంటో తెలుసుకునేందుకు గూగుల్లో సర్చ్ చేసింది.
This news item has appeared in India Today as well..
— AstroCounselKK🇮🇳 (@AstroCounselKK) October 31, 2023
MUST WATCH & Share Max for welfare of all .
Extreme CAUTION ⚠️ 😳 pic.twitter.com/biPFBpIY1v
401 కోడ్ రహస్యమిదే : అప్పుడే ఆమె అనుమానం నిజమైంది. ఆమె గూగుల్ లో తెలుసుకున్న దానిని బట్టీ, ఆ కోడ్ అనేది కాల్ ఫార్వార్డింగ్ కమాండ్ అని తేలింది. అంటే, ఆ కోడ్‌కు డయల్ చేసినట్లయితే.. ఇది మన నెంబర్కు సంబంధించిన అన్ని ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజ్ లు, వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు) వంటి కీలకమైన డేటాను 401 కమాండ్‌తో లింక్ చేసిన నంబర్‌కి వెళ్తాయని గూగుల్ సెర్చ్ ద్వారా తెలిసింది. సైబర్ మోసగాళ్ల కొత్త తరహా మోసాన్ని అందరికీ తెలియజెప్పి, అప్రమత్తం చేసేందుకు ఆ వీడియోను పోస్టు చేసింది. ఈ తాజా వీడియోతో 401 అనేది కాల్ ఫార్వార్డింగ్ కోడ్ అని.. అలా చేస్తే కాల్స్, ఓటీపీలు, మెసేజ్‌లు ఇతర వివరాలు ఆ నెంబర్‌కు ఫార్వార్డ్ అవుతాయని చాలామంది గ్రహించారు. అందుకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి.












Click it and Unblock the Notifications