Apple Vision Pro: రేపటి టెక్నాలజీ నేడు - యాపిల్ నుంచి మరో వండర్,ఏంటీ విజన్ ప్రో..!

గ్యాడ్జెట్స్‌లో యాపిల్ సంస్థను పడగొట్టే సంస్థ ఇంకా పుట్టలేదు. పుట్టబోదు కూడా. భవిష్యత్‌లో రావాల్సిన టెక్నాలజీని ఇప్పుడే అందిస్తూ అద్భుతాలను క్రియేట్ చేస్తోంది యాపిల్ సంస్థ. ఐఫోన్ నుంచి యాపిల్ వాచ్ వరకు ఏది మార్కెట్‌లోకి తన ఉత్పత్తిని విడుదల చేసినా.. అది ఒక సెన్సేషనే అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రాడక్ట్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. గత కొంత కాలంగా గ్యాడ్జెట్ లవర్స్‌ను ఊరిస్తూ వస్తోన్న విజన్ ప్రో ఎట్టకేలకు అమెరికాలో లాంచ్ అయ్యింది. న్యూయార్క్ సిటీలోని ఐదవ యాపిల్ ఎవెన్యూ స్టోర్‌లో ఈ విజన్ ప్రో హెడ్‌సెట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్.

యాపిల్ నుంచి కొత్తగా వచ్చిన విజన్ ప్రో ఒక వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్.దీని ధర 3500 అమెరికన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.2,90,500. బాబోయ్ ఇందులో అంత ఏముందని అనుకుంటున్నారా.. ముందుగా చెప్పుకోవాల్సింది బ్రాండ్. విజన్ ప్రో హెడ్ సెట్ యాపిల్ బ్రాండ్ కావడం ఒక కారణమైతే ఇందులో వినియోగించిన టెక్నాలజీ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ గురించి సీఈఓ టిమ్ కుక్ వివరించారు.

Tim Cooks visionary Leap:Introducing Apple Vision Pro as the pinnacle of tomorrows technology

ట్రెండ్ క్రియేట్ చేస్తుంది:

"విజన్ ప్రో హెడ్‌సెట్‌ను చాలా మంది ఉపయోగిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదొక స్పేషియల్ కంప్యూటర్. ఐ ఫోన్ ఇప్పుడు మొబైల్ కంప్యూటర్‌లా మారిపోయింది,మాక్ పర్సనల్ కంప్యూటర్‌ కింద రూపాంతరం చెందింది. ఇక విజన్ ప్రో హెడ్ సెట్ స్పేషియల్ కంప్యూటర్‌గా మారుతుంది.ఇలాంటి టెక్నాలజీతో తయారు చేసిన ప్రాడక్ట్ ఒక్క యాపిల్ సంస్థకే సొంతం. మాక్, ఐపాడ్, ఐప్యాడ్,ఐఫోన్, యాపిల్ వాచ్ గ్యాడ్జెట్స్ ఎలా అయితే సొంత మార్క్‌ను క్రియేట్ చేశాయో తాజాగా విజన్ ప్రో హెడ్‌సెట్ కూడా కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంది" అని టిమ్ కుక్ చెప్పారు.

విజన్ ప్రో ఫీచర్స్:

విజన్ ప్రో ప్రత్యేకత గురించి టిమ్ కుక్ వివరించారు. ఇద్దరం ఒక చోట కూర్చొని విజన్ ప్రొ హెడ్ సెట్ ధరించి మాట్లాడుతుంటే మనం ఏదాని గురించి అయితే చర్చిస్తున్నామో అవన్నీ మన చుట్టూ స్క్రీన్స్‌ రూపంలో కనిపిస్తాయంటూ టిమ్ చెప్పారు. అంటే మనం మాట్లాడే మాటలను పసిగట్టి వాటిని స్క్రీన్స్ మీద ప్రెజెంట్ చేస్తుంది.అలా ఈ గ్యాడ్జెట్ డిజైన్ చేయబడిందన్నారు.అంతేకాదు రేపటి టెక్నాలజీ ఈ రోజే అంటూ కితాబిచ్చారు. ఈ గ్యాడ్జెట్ పై ఇప్పటికే 5వేల పేటెంట్లు కలిగి ఉన్నామని టిమ్ వివరించారు. ఇప్పటికే చాలామందితో ఈ ప్రాడక్ట్ గురించి మాట్లాడినట్లు చెప్పిన టిమ్ వారినుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. అందుకే విజన్ ప్రో హెడ్‌సెట్‌ ధరకు న్యాయం చేశామని చెప్పుకొచ్చారు టిమ్ కుక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+