Fleettrack: మీ బండిలో అది ఉందా.. అయితే ప్రశాతంగా ఉండండి..!
ఒకప్పుడు దేశంలో ఇంటింటికో సైకిల్ ఉండడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక టూ వీలర్ ఉంటుంది. కొందరైతే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని టూవీలర్లు ఉంటున్నాయి. ముఖ్యంగా యువత ద్విచక్రవాహనాలను ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్ లు ఎక్కువగా కొంటుంటారు. ద్విచక్రవానాలు ధరలు రూ.70 వేల నుంచి కోట్ల రూపాయలు ఉంటాయి. ఇంత భారీ మొత్తం వెచ్చించి బైకులు కొన్న తర్వాత ఆవి పోతే.. అవును..
ఈ మధ్య టూవీలు దొంగతనలు భారీగా పెరిగిపోయాయి. హ్యాండిల్ లాక్ వేసినా కూడా దొంగలు చాకచక్యంగా ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్లలో జీపీఎస్ సిస్టం వస్తుంది. మరి జీపీఎస్ లేని వారు. జీపీఎస్ లేని వారు కూడా తమ టూవీలర్లను దొంగల భారీ నుంచి రక్షించుకోవచ్చు. అయితే దానికి కొద్ది మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాదాపు రూ.3 వేలు వెచ్చిస్తే మీరు బండ్లకు మీరు జీపీఎస్ అమర్చుకోవచ్చు.

దీని కోసం మీరు ఫ్లీట్ ట్రాక్ అనే ఓ పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. దీన్ని కారు, బస్సు, బైక్ లో అమర్చవచ్చు. ఫ్లీట్ ట్రాక్ ప్యాకేజీలో కనెక్ట్ చేసే వైర్లు, 12 నెలల సిమ్ కార్డ్ డేటాతో GPS ట్రాకింగ్ యూనిట్ (అన్ని రకాల వాహనాలకు (కీ లేదా కీలెస్ రెండూ) అనుకూలంగా ఉంటాయి. ఇవి Android, iOS సపోర్ట్ చేస్తుంది. ఈ పరికరాన్ని మీ బైక్ లో ఇస్టాల్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఫ్లీట్ ట్రాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఓపెన్ చేసి మన బండి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఎంత స్పీడ్ లో వెళ్తుందో కూడా తెలుసుకోవచ్చు. పార్కు చేసిన బండి మూ చేసిన కూడా మనకు అలారం వస్తుంది. స్పీడ్ అలర్ట్ ఇలా అన్ని ఉంటాయి. భారీ మొత్తం పెట్టి బైక్ కొనుగోలు చేసేవారు కొంత మొత్తం వెచ్చించి జీపీఎస్ అమర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications