మీ బెడ్‌రూమ్ లైట్ మీ హార్ట్‌ను చంపుతోందా? తాజా స్టడీ షాక్
రాత్రి నిద్రపోయేటప్పుడు లైట్ ఆన్ చేసి పడుకునే అలవాటు మీకూ ఉందా? చాలామందికి ఇది చాలా సాధారణంగా అనిపించే విషయం. కానీ ఇదే అలవాటు నెమ్మదిగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని తాజా శాస్త్రీయ అధ్యయనం గట్టిగా హెచ్చరిస్తోంది. "లైట్ ఆన్ చేసి నిద్రపోతే ఏమవుతుంది?" అనే ప్రశ్నకు ఆందోళన కలిగించే సమాధానం ఇప్పుడు బయటకు వచ్చింది.
ప్రతిష్ఠాత్మకమైన జామా నెట్‌వర్క్ ఓపెన్ (JAMA Network Open) జర్నల్‌లో ప్రచురితమైన తాజా స్టడీ ప్రకారం, నిద్ర సమయంలో గదిలో వెలుతురు ఉండటం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు దాదాపు 89,000 మందిని దీర్ఘకాలం పాటు గమనించి, వారి నిద్ర అలవాట్లు అదే సమయంలో గుండె ఆరోగ్యాన్ని విశ్లేషించారు.

హార్ట్ అటాక్ వచ్చే అవకాశం..
అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండటంతో పాటు భయపెట్టేలా కూడా ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు లైట్ వేసుకుని పడుకునే వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 47 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56 శాతం వరకు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే ఒక చిన్న అలవాటు గుండెపై భారీ ప్రభావం చూపుతుందన్న మాట.
సర్కేడియన్ రిథమ్..
శాస్త్రవేత్తల వివరణ ప్రకారం, రాత్రి సమయంలో వెలుతురు ఉండటం వల్ల శరీరంలోని సహజ జీవ గడియారం అయిన సర్కేడియన్ రిథమ్ (Circadian Rhythm) తీవ్రంగా దెబ్బతింటుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గడమే కాకుండా, స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, రక్తపోటు అసమతుల్యత, మెటబాలిజం మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులన్నీ కలిసి గుండెపై అదనపు భారం పెడతాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఇంకా చీకటి పడలేదులే..
ప్రత్యేకంగా టీవీ ఆన్ చేసి నిద్రపోవడం, నైట్ ల్యాంప్స్, మొబైల్, ల్యాప్ టాప్ స్క్రీన్ లైట్స్ నుంచి వచ్చే వెలుతురు కూడా ఇదే రీతిలో ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా చీకటి లేకపోవడం వల్ల మెదడు "ఇంకా చీకటి పడలేదులే" అన్న సంకేతాన్ని అందుకుని శరీరానికి విశ్రాంతి ఇవ్వదని వారు చెబుతున్నారు.
అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, మంచి నిద్ర కోసం పూర్తి చీకట్లోనే పడుకోవడం అత్యంత అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు లైట్లు ఆఫ్ చేయడం, స్క్రీన్‌లకు దూరంగా ఉండటం, గదిలో వెలుతురు పూర్తిగా లేకుండా చూసుకోవడం వంటి చిన్న మార్పులు పెద్ద ఆరోగ్య రక్షణగా మారతాయని అంటున్నారు.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications