బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..!

బ్యాచిలర్ బాయ్స్ కు మటన్ కర్రీ చేసుకోవాలని ఉంటుంది. కానీ అందుకు తగిన మసాలాలు, తయారీ విధానం కష్టంగా ఉండటంతో మటన్ జోలికి పోవడానికి ఇబ్బంది పడుతుంటారు. చికెన్ ఈజీగా చేసే బ్యాచిలర్స్.. మటన్ చేయడంపై ఆసక్తి చూపించరు. అయితే ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్ గా బ్యాచిలర్ స్టైల్ లో మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..? తక్కువ పదార్థాలతోనే టేస్టీ మటన్ కర్రీని ఎలా చేయాలి..? ఇక్కడ తెలుసుకుందాం..

బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటో, పసుపు, ఉప్పు, కరివేపాకు, నూనె, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. ఇక మటన్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా మటన్ ముక్కలకు పసుపు, ఉప్పు పట్టించి రెండు మూడు సార్లు బాగా నీటిలో కడగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి.

గిన్నెలో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు, టామాటో ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. అలా టమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కడిగిపెట్టుకున్న మటన్ ముక్కల్ని వేయాలి.

Mutton Curry Hyderabadi-Style Recipe Simple Ingredients and Easy Preparation Method mutton curry

ఇప్పుడు మటన్ ముక్కలు వేగేంతవరకూ నీళ్లు పోసి అలా మగ్గించుకోవాలి. మధ్యమధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి. మటన్ మెత్తగా ఉడికి నూనె పైకి తేలితే కర్రీ రెడీ అయినట్టే.. చివరగా కొత్తిమీర తురుము వేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+