నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..?

క్యారెట్ హల్వా అంటేనే ఒక తియ్యని అనుభూతి. దీనిని ఉత్తర భారతదేశంలో 'గజర్ కా హల్వా' అని పిలుస్తారు. పండుగలు, శుభకార్యాలు లేదా చలికాలం వచ్చిందంటే చాలు.. వేడివేడి క్యారెట్ హల్వా ఇచ్చే ఆనందమే వేరు. తక్కువ పదార్థాలతో ఇంట్లోనే చాలా రుచిగా దీనిని తయారు చేసుకోవచ్చు. సరైన పద్ధతిలో చేస్తే రెస్టారెంట్ టేస్ట్ కూడా వస్తుంది. వేడి క్యారెట్ హల్వా పక్కన ఒక స్కూప్ వెనీలా ఐస్‌క్రీమ్ వేసుకుని తింటే, ఆ కాంబినేషన్ అదిరిపోతుంది.

సాధారణంగా స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచివి కాదని అంటారు, కానీ క్యారెట్ హల్వాలో క్యారెట్ ఉండటం వల్ల విటమిన్-A, బీటా కెరోటిన్ మరియు ఫైబర్ లభిస్తాయి. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్మిస్) దీనికి పోషక విలువలను ఇస్తాయి. కాగా నెయ్యి ఎంత బాగా వేస్తే, హల్వా అంత కమ్మగా ఉంటుంది. అలానే క్యారెట్‌ను పాలల్లో నిదానంగా ఉడికిస్తేనే అది మెత్తగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా వస్తుంది. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

carrot-halwa-making-recipe-in-telugu-with-easy-steps-and-tips-for-serving-also-better-taste

కావలసిన పదార్థాలు..

  • క్యారెట్ - 1/2 కిలో (తాజాగా తురిమినది)
  • పాలు - 1/2 లీటరు (చిక్కటి పాలు అయితే ఇంకా మంచిది)
  • చక్కెర - 100 నుంచి 150 గ్రాములు (రుచికి అనుగుణంగా)
  • నెయ్యి - 4 నుంచి 6 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి - 1/2 టీస్పూన్
  • డ్రై ఫ్రూట్స్ - జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ (అవసరమైనన్ని)
  • కోవా - 1/2 కప్పు (ఐచ్ఛికం - రుచి పెంచుతుంది)

తయారీకి ముందు సూచనలు

  • క్యారెట్లను శుభ్రంగా కడిగి, పలుచగా తురుముకోవాలి
  • మందపాటి బాణలి లేదా నాన్‌స్టిక్ పాన్ ఉపయోగిస్తే కాలిపోవడం తగ్గుతుంది
  • పాలను ముందే కొంచెం వేడి చేసి ఉంచుకుంటే వేగంగా కుక్ అవుతుంది

తయారీ విధానం..

డ్రై ఫ్రూట్స్ వేయించడం..

ముందుగా ఒక బాణలిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, బాదం వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చివరలో కిస్‌మిస్ వేసి ఉబ్బే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

క్యారెట్ వేయించడం..

అదే పాన్‌లో మరో 1-2 స్పూన్లు నెయ్యి వేసి తురిమిన క్యారెట్ వేసాలి. 5-7 నిమిషాలు మధ్య మంటపై వేయిస్తూ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇది హల్వాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది.

పాలు కలపడం & ఉడికించడం..

ఇప్పుడు క్యారెట్‌లో పాలు పోసి బాగా కలపాలి. మోస్తరు మంటపై ఉంచి పాలు పూర్తిగా ఇంకే వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్‌లో క్యారెట్ మెత్తగా ఉడుకుతుంది మరియు మిశ్రమం చిక్కబడుతుంది.

చక్కెర వేయడం..

పాలు ఎక్కువగా ఇంకిపోయిన తర్వాత చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర వేసిన వెంటనే మిశ్రమం మళ్లీ పలుచబడుతుంది. మళ్లీ అది చిక్కబడే వరకు కలుపుతూ ఉంచాలి.

నెయ్యి & కోవా కలపడం..

ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసి కలపాలి. కోవా ఉపయోగిస్తే ఈ స్టేజ్‌లో వేసి బాగా కలపాలి. ఇది హల్వాకు రిచ్ టేస్ట్ ఇస్తుంది.

ఫైనల్ టచ్..

చివరగా యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.

సర్వింగ్ విధానం..

వేడిగా సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది

చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది

పైగా కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది

అదనపు చిట్కాలు..

డార్క్ రెడ్ క్యారెట్స్ వాడితే హల్వా కలర్, టేస్ట్ ఇంకా బెటర్‌గా ఉంటుంది

పాలు బదులుగా కొంత కండెన్స్డ్ మిల్క్ కలిపితే మరింత రిచ్ ఫ్లేవర్ వస్తుంది

చక్కెర తగ్గించి జాగ్గరీ (బెల్లం) వాడినా హెల్తీ ఆప్షన్

హల్వా కాలిపోకుండా ఎప్పటికప్పుడు కలపడం చాలా ముఖ్యం

తక్కువ నెయ్యి వాడాలంటే చివర్లో మాత్రమే వేసుకోవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+