Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరి 1 నుంచి శుక్రుడి వల్ల ఈ రాశుల తలరాత మారిపోతోంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే కళల్లో, ఫ్యాషన్ రంగంలో రాణిస్తారు. అంతేకాకుండా సంపదను, ఐశ్వర్యాన్ని, విలాసవంతమైన జీవితాన్ని కూడా శుక్రుడు ప్రసాదిసతాడు. అటువంటి శుక్రుడు వచ్చే నెల 1వ తేదీ నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

దీనివల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా బాగా కలిసిరానుంది. అంతేకాకుండా అత్యధిక లాభాలు, అధిక ఆదాయం పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

four zodiac signs will become millionaires due to venus will enter Capricorn from February 1st

మిథున రాశి
కొత్తగా ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. తండ్రివైపు నుంచి కానీ, భార్యవైపు నుంచి కానీ ఆస్తి కలిసివస్తుంది. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా బలపడతారు. మీపై ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఆ నమ్మకంతో పనులు అద్భుతంగా పూర్తిచేస్తారు. ఊహించనిస్థాయిలో ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది.

తులా రాశి
ప్రతి పనిలోను మంచి విజయాలను నమోదు చేస్తారు. శుక్రుడి ప్రభావంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. చేసే ప్రతి పనిలో లాభాలున్నాయి. ఏ పని ప్రారంభించాలనుకుంటున్నప్పటికీ అది చక్కగా ప్రారంభమై మంచి ఫలితాలను అందిస్తుంది. వీరికి సంపద పెరుగుతుంది.

మకర రాశి
పాత పెట్టుబడుల నుంచి అద్భుతమైన లాభాలను ఈ సమయంలో అందుకుంటారు. కొత్తగా ఉద్యోగాలు పొందాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం లభిస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు.

వృషభ రాశి
సంపద భారీగా పెరుగుతుంది. ఆస్తులు కలిసివస్తాయి. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. భారీ మొత్తంలో డబ్బును ఆర్జిస్తారు. సమాజంలో గౌరవం, పరపతి పెరుగుతుంది. వ్యక్తిత్వ ఆకర్షణకు లోనవుతారు. పెళ్లిళ్లు కానివారికి పెళ్లిళ్లు అవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారు చాలా గట్టిగా ప్రయత్నించాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని, బృహస్పతిని పూజిస్తే మంచి జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+