వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు?
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో ఉండే శక్తి ఆ ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల అభివృద్ధిని, ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. దీనినే మనం పాజిటివ్ ఎనర్జీ అంటాం. ప్రతికూలంగా ఉంటే నెగెటివ్ ఎనర్జీ అని పిలుస్తాం. సానుకూల శక్తి, ప్రతికూల శక్తిలో మీ ఇంట్లో ఏ శక్తి ఉందో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
పాజిటివ్ ఎనర్జీని వాస్తులో 'ప్రాణ శక్తి' అంటారు.
ఇది విశ్వం నుండి, ముఖ్యంగా సూర్యరశ్మి, గాలి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రశాంతత కలుగుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది.
ఆర్థికంగా నిలకడగా ఉంటారు.
శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
సానుకూల శక్తి ఇంట్లోకి ఈశాన్యం మూల నుండి ప్రవేశిస్తుంది.
అందుకే ఈ మూలను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి.

నెగెటివ్ ఎనర్జీని 'స్తబ్దత' లేదా అడ్డంకి అంటారు.
శక్తి ప్రవాహం సరిగ్గా లేనప్పుడు లేదా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది.
కారణం లేకుండా చికాకులు, తరచూ అనారోగ్య సమస్యలు,
నిద్రలేమి, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం నెగెటివ్ ఎనర్జీకి సంకేతాలు.
మూలల్లో పేరుకుపోయిన చెత్త, చీకటి గదులు, విరిగిన వస్తువుల వల్ల ఇది పెరుగుతుంది.
మీరు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇంట్లోని ఇండోర్ ప్లాంట్స్
పదే పదే ఎండిపోతుంటే అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం.
చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య పెద్ద పెద్ద వాదనలు జరగడం.
ఇంట్లో ఉన్నంత సేపు ఏదో తెలియని నిస్సత్తువగా అనిపిస్తుంది.
బయటకు వెళ్తే ఉత్సాహంగా ఉంటారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు, పైపులు లేదా లాకులు పదే పదే రిపేరుకు వస్తుంటాయి.
ఇల్లు శుభ్రం చేసినా ఎక్కడో ఒకచోట తెలియని వింత వాసన వస్తుంటుంది.
పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి వీటిని పాటించండి.
వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కల్లు ఉప్పువేసి తుడవండి.
ఉప్పుకు నెగెటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంటుంది.
ఉదయం పూట కనీసం గంట సేపు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి.
సూర్యరశ్మి సహజమైన నెగెటివ్ ఎనర్జీని చంపేస్తుంది.
సాయంత్రం వేళ ఇంట్లో కర్పూరం లేదా సాంబ్రాణి ధూపం
వేయడం వల్ల ఇంట్లో ఉండే గాలి శుద్ధి అవుతుంది.
పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, విరిగిన కుర్చీలు
ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఇవి నెగెటివ్ ఎనర్జీకి ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి.
హాల్ లో ప్రకృతి దృశ్యాలు లేదా కుటుంబ సభ్యులు నవ్వుతున్న ఫోటోలు ఉంచండి.












Click it and Unblock the Notifications