జనవరి 20నుండి దరిద్రం వీరు వద్దన్నా వదలదు.. శాసిస్తున్న శనిదేవుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శనిదేవుడిని కర్మ దేవుడిగా, న్యాయానికి అధిపతిగా భావిస్తారు. అలాంటి శనిదేవుడు అత్యంత నెమ్మదిగా సంచారం చేసే దేవుడు . ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుండటంతో ద్వాదశ రాశులపై శని ప్రభావం అత్యధికంగా ఉంటుంది.శని రాశులతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ సంచారం చేస్తాడు.
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని
దాదాపు 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. ఈ మార్పు చాలా శక్తివంతమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జనవరి 20న మధ్యాహ్నం 12:13 గంటలకు శని దేవుడు ఉత్తర భాద్రపద నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు.దీని కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. శనిదేవుడు నక్షత్ర సంచారం కారణంగా సమస్యల సుడి గుండంలో పడే రాశులను తెలుసుకుందాం.

మేషరాశి
శని ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే శని దేవుడు ఉండటం కారణంగా కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు వచ్చి, పనుల్లో ఒత్తిడి తప్పకుండా ఎదురవుతుంది. ముఖ్యంగా మేషరాశి జాతకులు శని నక్షత్ర సంచారంతో నష్టాలను, కష్టాలను చూస్తారు. ఈ సమయంలో అనవసరమైన వాదనలు, వివాదాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
సింహరాశి
సింహరాశి జాతకులకు శని నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో కష్టానికి తగిన ఫలితం రాదు. ఆర్ధిక నష్టాలు వస్తాయి. ముఖ్యమైన పనులు పెండింగ్ లో పడి ఆందోళనకు లోనవుతారు. ఉద్యోగులకు పని చేసేచోట ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు శని నక్షత్ర మార్పు ఆందోళనకు కారణం అవుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి,. ఏవైనా పెట్టుబడులు పెట్టటానికి ఇది అనుకూల సమయం కాదు. ఏ పని చేసినా ఆచి తూచి అడుగు వెయ్యాల్సి ఉంటుంది . ధనుస్సు రాశి జాతకులు ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications