జగన్ ఆరోపణ: చంద్రబాబును సూటిగా అడిగారు, సింగపూర్ కంటే 200 రెట్లు ఏపీ
తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని, ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు ఇచ్చి టిడిపిలో చేర్చుకుంటున్నారని వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
చెన్నై: తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని, ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు ఇచ్చి టిడిపిలో చేర్చుకుంటున్నారని వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రశ్న మీడియా ప్రతినిధి అడగటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట.
ఓ వైపు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై మీరేమంటారని అడగటంతో.. అలా అన్న వారు ఎవరని చంద్రబాబు ఘాటుగా స్పందించారట.
ఇండియా టుడే చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి మంగళవారం కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరాయి విజయన్, డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇండియా టుడే ప్రతినిధి ప్రతిపక్షం చేస్తున్న ఎమ్మెల్యే కొనుగోలు ఆరోపణలను ప్రశ్నించింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదని, అభివృద్ధిని చూసి వస్తున్నారని చెప్పారు.
తాను శాశ్వతంగా ప్రజలకు గుర్తుండిపోయే రీతిలో సింగపూర్ కన్నా రెండు వందల రెట్లు ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఏపీ చాలా పెద్దదని, అందుకే అత్యంత విస్తృతంగా దీనిని అభివృద్ధి చేయడానికి అవకాశముందన్నారు.
విభజన పరిణామాలపై ఆయన ఉద్వేగంగా మాట్లాడుతూ.. మనమంతా కలిసి నిర్మించుకున్న రాజధాని హైదరాబాదు ఆంధ్రులకు దూరమైందని తనకు విచారం లేదని, అందుకు దీటుగా దేశంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తామన్నారు.
విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి ప్రజలు, రైతులు వేలాది ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారని, భూసేకరణలో రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సరికాదన్నారు. భూములు ఇంకా ప్రజల ఆదీనంలోనే ఉన్నాయన్నారు. అలాంటప్పుడు అవినీతి అని ఎలా అంటారని ప్రశ్నించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications