షాక్: ప్రియుడితో భర్తను చంపించింది, ప్రియుడూ ఆత్మహత్య
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను తీసింది. తమ ఏకాంతానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను చంపించింది భార్య, అయితే ఈ విషయం బయటకు తెలియడంతో ప్రియుడు కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని
విజయనగరం: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను తీసింది. తమ ఏకాంతానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను చంపించింది భార్య, అయితే ఈ విషయం బయటకు తెలియడంతో ప్రియుడు కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలంలో చోటుచేసుకొంది.
విజయనగరం జిల్లా బాడంగి మండలం కోటిపల్లికి చెందిన కొయ్యాన ధనుంజయ్ గొర్రెల కాపరి. ఇతడికి బలిజపేట మండలం తుమరాడకు చెందిన రామలక్ష్మితో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. రామలక్ష్మికి పెళ్ళైన కొన్నాళ్ళకే బాడంగి మండలం వాడాడకు చెందిన బోగాది గణపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ధనుంజయ్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతడి అడ్డును తొలగించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకొన్నారు. గత నెల 21న, ధనుంజయ్‌కు మాయమాటలు చెప్పి గణపతి ఊరి నుండి దూరంగా తీసుకెళ్ళాడు. కత్తితో ధనుంజయ్‌ను నరికేశాడు.
అనంతపురం పక్కనే ఉన్న చెరువులో తోసేశాడు. అయితే ఆరోజు నుండి ధనుంజయ్ ఇంటికి రాకపోవడంతో అతడు ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడని కుటుంబసభ్యులు బంధువులు చుట్టుపక్కల గ్రామాలు, సన్నిహితుల ఇళ్ళ వద్ద వెతికారు. ఈ నెల 4న, బాడంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అయితే భర్త కనిపించకుండాపోయినా రామలక్ష్మిలో బాధ లేకపోవడాన్ని స్థానికులు గుర్తించారు.
ఈ విషయమై స్థానికులు, బంధువులు ఆమెను నిలదీశారు. అయితే ఆమె అసలు విషయం బయటపెట్టింది. గణపతి సహయంతో ధనుంజయ్‌ను హత్యచేయించినట్టు ఆమె చెప్పింది. ఈ విషయం బయటపడడంతో గణపతి అదేరోజు రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications