వివాహిత ప్రాణం తీసిన ఫోన్ కాల్: అనుమానంతో రెచ్చిపోయిన భర్త..
మస్తులంతా సర్దిచెప్పినా వినలేదు. అదే కోపంతో ఓ కర్రతో శోభ తలపై బాది హతమార్చాడు. భార్య చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
అనంతపురం: అనుమానం పెనుభూతమైంది. భార్య ప్రతీ కదలికను అనుమానంతో ముడిపెట్టి చూసే ఓ భర్త.. చివరాఖరికి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఫోన్ కాల్ విషయంలో మొదలైన అనుమానం.. చివరకు ఓ ఇల్లాలిని బలితీసుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం గోనిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే.. పుట్టపర్తి మం డలం దండువారిపల్లికి చెందిన శోభ(25)కు గోనిపేట వాసి చెన్నకేశవులుతో 8ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక నాలుగేళ్ల పాప, ఏడాదిన్నర బాబు ఉన్నారు. పెళ్లయిన సంవత్సరం పాటు సాఫీగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత విభేదాలతో గొడవలకు దారితీసింది. ముఖ్యంగా భార్య పట్ల చెన్నకేశవులు విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు.

ఇదే క్రమంలో ఓసారి కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శోభకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీనిపై భర్త చెన్నకేశవులు ఆవేశంతో రగిలిపోయాడు. అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. గ్రామస్తులంతా సర్దిచెప్పినా వినలేదు. అదే కోపంతో ఓ కర్రతో శోభ తలపై బాది హతమార్చాడు. భార్య చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
పోలీసుల సమాచారం మేరకు ఎస్ఐ జనార్దన హత్య స్థలాన్ని పరిశీలించారు. శోభ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చెన్నకేశవులుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications