వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ తీరంలో విషపు చేప: తింటే ప్రాణాలకే ముప్పు.. ప్రపంచంలో ఇలాంటివి నాలుగే?

ఆంధ్ర విశ్వ విద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్(ఎంఎల్ఆర్) విభాగం ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రపంచం మొత్తం మీద ఉన్న నాలుగు అత్యంత విషపూరిత చేప జాతుల్లో ఒక రకం విశాఖ తీరంలో లభ్యమైంది. షార్ప్ టైల్ చేపగా పిలిచే ఈ జాతి చేపల్ని తింటే ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు.

ఈ చేపల్లో ఉండే సఫర్ పాయిజన్ అనే విషపూరిత గ్రంధుల వల్ల వీటిని తిన్న వెంటనే వాంతులు, పక్షవాతానికి గురై మరణిస్తారని చెబుతుననారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్(ఎంఎల్ఆర్) విభాగం ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధన:

ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధన:

విశ్వవిద్యాలయ పూర్వ అధిపతి ప్రొఫెసర్ దేవర వేణు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిషింగ్ టెక్నాలజీ(సీఐఎఫ్.టి)లో సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ ఎన్ఎం కృష్ణ, నన్నయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.గోవిందరావు సముద్ర జాతులపై, మత్స్య సంపదపై జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా ఈ షార్ప్ టైల్ గురించి వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Fish : A Smart Choice For Diabetes - చేప తరువాతే ఏదైనా అంటున్న..... - Oneindia Telugu
కప్ప చేప.. షార్ప్ టైల్ మోలా:

కప్ప చేప.. షార్ప్ టైల్ మోలా:

స్థానికులు దీన్ని కప్ప చేపగా పిలుస్తారని పరిశోధకులు చెబుతున్నారు. దీని ముక్కు చిలక ముక్కును పోలి ఉంటుందని, నోరు డైమండ్ ఆకారంలో ఉంటుందని, రెండు పళ్లు ఉంటాయని, ప్రపంచం మొత్తం మీద ఇలాంటి రకాల చేపలు 4రకాలే ఉంటాయని అంటున్నారు.

తూర్పు తీరంలో ఒక్క విశాఖలోనే:

తూర్పు తీరంలో ఒక్క విశాఖలోనే:

ఈ షార్ప్ టైల్ మోలా చేపకు దగ్గరి పోలికలున్న మరో రకం చేపను పశ్చిమ తీరంలో గుర్తించినట్లు తెలిపారు. దీనిలా దానికి తోక మాత్రం ఉండదన్నారు. సైన్స్ పరిభాషలో దీన్ని మోలామోలాగా పిలుస్తారని చెప్పారు. దేశంలోని తూర్పు తీరంలోకెల్లా ఒక్క విశాఖ తీరంలోనే షార్ప్ టైల్ మోలా రకం చేపలు ఉన్నట్లు తెలిపారు. దీనిని సన్ ఫిష్, పఫర్ ఫిష్ గాను పిలుస్తారని చెప్పారు.

విషపూరితం:

విషపూరితం:

అర్థచంద్రాకారంలో సుమారు 40-45కిలోల బరువుతో, 1.4మీటర్ల పొడువుతో ఈ చేపలు ఉంటాయన్నారు.

ఈ చేపలు తినడం విషపూరితమని స్థానిక మత్స్యకారులకు తెలుసునని, అయితే దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Masturus lanceolatus also known as the sharptail mola is a species of mola found in Vizag beach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X