Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబూ! జవాబు చెప్పవేం: ఏకిపారేసిన శిల్పా కూతురు, కోడలు

శిల్పా సహకార సొసైటీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పా, కోడలు నాగిని రెడ్డిలు ధీటుగా స్పందించారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు.

నంద్యాల: శిల్పా సహకార సొసైటీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పా, కోడలు నాగిని రెడ్డిలు ధీటుగా స్పందించారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబూ! దీనికి జవాబు చెప్పవేం

చంద్రబాబూ! దీనికి జవాబు చెప్పవేం

2014లో వైసిపి నుంచి గెలిచిన 21 మంది ఆ తర్వాత టిడిపిలో చేరారని, అందులో నలుగురు మంత్రులు అయ్యారని, వారికి టిడిపిలో కొనసాగే నైతిక హక్కు ఎక్కడిదని, దీని గురించి అడిగితే చంద్రబాబు జవాబు చెప్పరని శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పా నిలదీశారు. పైగా తమపై నిందలు వేస్తారన్నారు.

Recommended Video

    Nandyal by-elections : Chandrababu Naidu holds Road Show, Watch Video
    మంత్రులు, టిడిపి నేతలు ఇక్కడ కనిపించరు

    మంత్రులు, టిడిపి నేతలు ఇక్కడ కనిపించరు

    తన తండ్రి నంద్యాలకు ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నారని కూతురు శిల్పా అన్నారు. చంద్రబాబు, టిడిపి నేతల బెదిరింపులకు నంద్యాల ప్రజలు భయపడవద్దని ఆమె ధైర్యం చెప్పారు. రెండు రోజుల తర్వాత మంత్రులు, టిడిపి నేతలు ఇక్కడ కనిపించరని ఎద్దేవా చేశారు.

    మా నాన్న మంచివాడు

    మా నాన్న మంచివాడు

    తన తండ్రి శిల్పా మోహన్ రెడ్డి అనుభవం కలిగిన నేత అని, మంచివాడు అని కూతురు శిల్పా అన్నారు. ఆయనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నేతలు ఓట్ల కోసం తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. నంద్యాల ప్రజల వెంట తమ కుటుంబం ఉంటుందన్నారు.

    ఓటమి భయంతోనే.. శిల్పా నాగిని రెడ్డి

    ఓటమి భయంతోనే.. శిల్పా నాగిని రెడ్డి

    శిల్పా సహకార సొసైటీని మహిళల కోసం నడిపిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్, శిల్పా కోడలు శిల్పా నాగిని రెడ్డి అన్నారు. దీని వల్ల మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. శిల్పా మంచి వ్యక్తి అని గతంలో చంద్రబాబే చెప్పారన్నారు. ఇప్పుడు ఓటమి భయంతో మాట్లాడుతున్నారన్నారు. ఓటమి భయంతో చిన్న విషయాలను తప్పులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+